అంతులేని ప్రేమ, అంతులేని వినోదం అనే నినాదంతో తెలుగు లోగిళ్లలో అంతులేని ఆనందాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది ‘ఆహా’. ఈ నూరు శాతం తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో తాజాగా ఓ కొత్త వెబ్ సీరిస్ మొదలు కాబోతోంది. అదే ‘అల్లుడుగారు’. అభిజీత్ పూండ్ల, ధన్య బాలకృష్ణ, వై. కాశీ విశ్వనాథ్, సుధ, షాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సీరిస్ ను ‘లవ్ లైఫ్ అండ్ పకోడి’ ఫేమ్ జయంత్ గాలి డైరెక్ట్ చేశారు. తమడ మీడియా దీనిని నిర్మించింది. మోడ్రన్ డే రిలేషన్‌షిప్స్, అందులో ఉన్న కాంప్లికేషన్స్ గురించి పర్ఫెక్ట్ గా ఫోకస్ చేసి తీసిన ఈ వెబ్ సీరిస్ ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 29 న స్ట్రీమింగ్ కాబోతోంది. దీని గురించి దర్శకుడు చెబుతూ, ”’అల్లుడు గారు’ కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ. కొత్త పెళ్లైన జంట అజయ్, అమూల్య చుట్టూ తిరుగుతుంది. సాంప్రదాయక కుటుంబంలో తన అత్తమామలు నళిని, అశోక్ తో ఉండవలసి వచ్చిన అజయ్ పరిస్థితిని సరదాగా తెరకెక్కించాం. మొదట్లో వాళ్లతో ఇమడలేకపోయినప్పటికీ, వాళ్ల అభిరుచులకు తగ్గట్టు ప్రవర్తించడానికి అజయ్ చాలానే కష్టపడతాడు. అతని ఆలోచనలు, అభిరుచులు ఇంకో రకంగా ఉంటాయి. అయినా పెద్దల మధ్య ఉండాల్సి వచ్చినప్పుడు అతను ప్రవర్తించే విధానం కడుపుబ్బా నవ్విస్తుంది” అని అన్నారు. ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ, ”’తరగతి గదిలో, కుడి ఎడమైతే, ది బేకర్ అండ్ ద బ్యూటీ’… ఇలా ప్రతి జోనర్‌లోనూ ఓ హిట్ షోని ‘ఆహా’ రిజిస్టర్ చేసింది. ఈ కోవలో ‘అల్లుడుగారు’ కూడా కచ్చితంగా హిట్ సీరీస్‌గా పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో జరిగే కథ, బంధాలు, అనుబంధాలకు సంబంధించిన కంటెంట్ కావడంతో కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది” అని తెలిపారు.
ఆహా కోసం ‘అల్లుడు గారు’గా మారిన అభిజిత్!
