Site icon NTV Telugu

చైతూ ‘లవ్ స్టొరీ’కి భారీ రెస్పాన్స్

5M+ Real time views with 300k likes for Love StoryTrailer

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. అప్పటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమా విడుదల గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల కానుంది అంటూ ఇటీవలే ప్రకటించారు మేకర్స్. పవన్ సిహెచ్ సంగీతం అందించగా… ఈ సినిమా పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్లో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. నిన్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

Read Also : అన్ని రకాల షేడ్స్‌తో.. దుమ్మురేపిన ‘లవ్ స్టోరీ’ ట్రైలర్

శేఖర్ కమ్ముల మార్క్ ట్రైలర్ లో కన్పించింది. పైగా ట్రైలర్ చాలా ఫ్రెష్ గా ఉంది. యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది. ట్రైల్ విడుదలైన కొన్ని గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. “లవ్ స్టోరీ” ట్రైలర్ విడుదలైన 10 గంటల్లోనే 300కే లైక్స్ రావడం మరో విశేషం. ఈ సినిమా విడుదల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version