NTV Telugu Site icon

Salman Khan Firing: షాకింగ్: కాల్పుల కేసులో మరో ఇద్దరి అరెస్టు?

Salman Khan

Salman Khan

2 More Arrested in Salman Khan Firing Case: ఏప్రిల్ 14 న, నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల సంఘటన జరిగింది. ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసిన విక్కీ గుప్తా, సాగర్ పాల్ ఇద్దరినీ ముంబయిలోని ఎస్ప్లానేడ్ కోర్టు ఏప్రిల్ 29 వరకు క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి పంపింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రకారం, సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన షూటర్ల వద్ద రెండు తుపాకులు ఉన్నాయి. వారిని 10 రౌండ్లు కాల్పులు జరపాలని ఆదేశించారు. ఇక ఇప్పుడు కొత్త అప్‌డేట్ ప్రకారం, ముంబై క్రైమ్ బ్రాంచ్ పంజాబ్‌కు చెందిన సోను సుభాష్ చందర్ అలాగే అనుజ్ థాపన్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితులిద్దరూ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంప్రదింపులు జరుపుతూ ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులకు తుపాకీలను అందించారని చెబుతున్నారు.

Aa Okkati Adakku: అందరికీ కనెక్ట్ అయ్యే కథ.. ఫస్ట్ ఛాయిస్ ఆయనే : నిర్మాత రాజీవ్ ఇంటర్వ్యూ

ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన కేసులో ఇంతకు ముందు అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల పోలీసు కస్టడీని కోర్టు గురువారం ఏప్రిల్ 29 వరకు పొడిగించింది.ఇక ఈ కేసులో అన్మోల్ బిష్ణోయ్, లారెన్స్ బిష్ణోయ్ కూడా నిందితులుగా ఉన్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి అందిన సమాచారం ప్రకారం, కాల్పుల ఘటనకు ముందు, షూటర్లు సల్మాన్ ఖాన్ ఇంటి మీదుగా నాలుగు సార్లు ముందుకు వెనెక్కి వచ్చారు. నిందితులను అరెస్టు చేయగా, వారి నుంచి పగిలిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు ఉన్నాయని, ఇప్పుడు మిగిలిన ఫోన్‌ల కోసం కూడా శోధిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. సూరత్‌లోని తాపీ నది నుంచి రెండో పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ గతంలో తెలియజేసింది.

Show comments