NTV Telugu Site icon

18 Pages: మాస్ మహరాజాను ఢీ కొట్టబోతున్న నిఖిల్!

Dhamaka

Dhamaka

18 Pages: ఈ యేడాది పాన్ ఇండియా మూవీ ‘కార్తికేయ-2’తో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్. అందులో అతనికి జోడీగా నటించింది అనుపమా పరమేశ్వరన్. ఇప్పుడు వీరిద్దరూ జంటగా మరో సినిమాలో నటిస్తున్నారు. అదే ’18 పేజీస్’. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్ ని ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ రాయగా, దానిని ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సూపర్ క్రేజీ మూవీని సుకుమార్ రైటింగ్స్ తో కలిసి జిఎ2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ జరుగుతోంది. దాంతో ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఎ. వసంత్ సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే.. ఇప్పటికే డిసెంబర్ 23న మాస్ మహరాజా రవితేజాతో తాము నిర్మిస్తున్న ‘థమాకా’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆ చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు. సో.. ఆ రోజున రవితేజ, నిఖిల్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడబోతున్నాయి.