సీనియర్ నటి సుహాసినిని చూడగానే పద్ధతిగల ఇల్లాలుగా కనిపిస్తుంది. ఆమె చీరకట్టు పద్ధతిలోను.. మోడ్రన్ డ్రెస్ ల్లోనూ దక్షిణాది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేసింది. తెలుగు తెరపై ఆమె సీనియర్ హీరోలందరితోను నటించింది. ఇక సినిమా.. గ్లామర్ ప్రపంచం అయినప్పటికీ సుహాసిని ఏనాడూ తన అందాల ఆరబోత విషయంలో పరిధి దాటి నటించిన సందర్భాలు లేవు. కేవలం సహజ అందం, అభినయంతో యూత్ మనసులను గెలుచుకోంది. సుహాసిని తన కెరీర్ లో నందమూరి బాలకృష్ణతో చేసిన సినిమాలు చాలా ఎక్కువే.. చిరు, వెంకీతోను హిట్ సినిమాలే చేసింది. అప్పటికే సీనియర్ హీరో అయిన శోభన్ బాబు లాంటి స్టార్స్ తోను ఆమె నటించింది. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నంను సుహాసిని వివాహమాడింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తోంది.
కాగా, ఆగస్టు 15న సుహాసిని బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకుంది. రీసెంట్ గా ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలతో పాటు డాన్స్ చేసిన వీడియోను రమ్యకృష్ణ షేర్ చేసింది. ఈ పార్టీలో కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, రమ్యకృష్ణ, కుష్బూ మరియు బంధుమిత్రులతో కలిసి సుహాసిని తెగ సందడి తెలిసింది.
