NTV Telugu Site icon

Wine Bottle : వైన్ బాటిల్ ను ఓపెన్ చేశాక ఎన్ని రోజులు తాగొచ్చో తెలుసా?

Wine Bottle

Wine Bottle

ఒకప్పుడు మద్యం పేరు చెప్పగానే చాలా మంది ఆమడ దూరం ఉండేవాళ్లు.. కానీ ఇప్పుడు ఆడా, మగ అని తేడా లేకుండా అందరూ మధ్యాన్ని తాగుతున్నారు.. ఇంట్లో చిన్న ఫంక్షన్ నుంచి మొదలు పెద్దపెద్ద కార్యాల వరకు మందులేనిదే ముద్ద దిగని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా చాలామంది మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. అయితే చాలామంది మళ్లీ మళ్లీ బయటకు వెళ్లలేక ఒకేసారి పెద్ద బాటిల్ ను తెచ్చుకొని అప్పుడప్పుడు తాగుతారు.. అయితే అలా ఓపెన్ చేసిన బాటిల్ ను ఎన్ని రోజుల వరకు తాగవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అలా ఓపెన్ చేసిన బాటిల్ కు కూడా ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుంది.. ఒక్కసారి ఓపెన్ చేసిన బాటిల్ ను ఎన్ని రోజుల వరకు తాగవచ్చు అనే సందేహం చాలా మందికి వస్తుంది.. అసలు విషయానికొస్తే.. కొంతమంది మధ్యాన్ని లిమిటెడ్ గా తాగుతూ ఉంటారు. లీటర్ ఆపై బాటిల్ తెచ్చుకొని, రోజుకు ఒక చిన్న పెగ్గులెక్కన కొన్ని రోజులపాటు తాగుతూ ఉంటారు. మద్యం బాటిల్ ఓపెన్ చేయగానే అందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. అలా అది వెనిగర్ అవుతుందట..

అందుకే ఒక బాటిల్ ను ఓపెన్ చేసిన తర్వాత మూడు నుంచి వారం రోజుల లోపు మాత్రమే తాగాలట.. అంతేకాకుండా యువత ఎక్కువగా ఇష్టపడే బీర్ ఎక్స్పైరీ డేట్ కంటే ముందే ముగుస్తుందట. సాధారణంగా బీర్ బాటిల్ గడువు కాలం ఆరు నెలలు. దీన్ని కూడా ఓపెన్ చేసిన ఒక రోజులో మాత్రమే తాగాలట. అలా కాకుండా ఓపెన్ చేసి కొన్ని రోజులపాటు ఉంటే అది ఆక్సిజన్ తో చర్యలు జరిపి వాసనతో పాటుగా రుచి కూడా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.. సో మందుబాబులు బీ కేర్ ఫుల్..