Site icon NTV Telugu

Moon Disappear: చంద్రుడు అదృశ్యమైతే, భూమి పరిస్థితి ఏంటి..? ఆందోళనలో సైంటిస్టులు..

Earth Moon

Earth Moon

Moon Disappear: భూమికి ఉన్న సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు కూడా చంద్రుడే. ఎన్నో ఏళ్లుగా భూమి గురుత్వాకర్షణ పరిధిలో చంద్రుడు ఉంటున్నాడు. చంద్రుడు లేని భూమిని అసలు ఊహించుకోలేము. ఒక విధంగా చెప్పాలంటే భూమిని టెలివిజన్ అనుకుంటే, చంద్రుడు స్టెబ్‌లైజర్ లాంటి వాడు.

అయితే, ఇలాంటి చంద్రుడు ప్రతీ ఏడాది 3.8 సెంటీమీటర్లు (సుమారు 1.5 అంగుళాలు) మేర భూమి నుంచి దూరంగా జరుగుతున్నాడు. దీంతో పాటు చంద్రుడి అంతర్భాగం క్రమంగా చల్లబడుతుండటంతో కుచించుకుపోతున్నట్లు శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ పరిణామాలపై సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు.

చంద్రుడి సంకోచం గతంతో పోలిస్తే వేగంగా జరుగుతోందని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం యొక్క సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ పరిశోధకులు చెబుతున్నారు. కాలక్రమేణా చంద్రుడు వేడిని కోల్పోతున్నప్పుడు, దాని లోపలి భాగం కుంచించుకుపోతుంది, దీనివల్ల ఉపరితల క్రస్ట్ ముడతలు పడుతూ కుంచించుకుపోతుంది. సీనియర్ సైంటిస్ట్ థామస్ ఆర్ వాటర్స్ 2010లో చంద్రుడు కుచించుకుపోతున్నాడనే దానికి మొదటిసారిగా ఆధారాలు సమర్పించారు. ఇలా కుంచించుకుపోవడం వల్ల చంద్రుడి ఉపరితలంపై చిన్నపాటి కొండలు, పగుళ్లు ఏర్పడుతాయి. దీని వల్ల చంద్ర కంపాలు ఏర్పడే అవకాశం ఉంది.

చంద్రుడు అదృశ్యమైతే పరిస్థితి ఏంటి..?

చంద్రుడు ఇప్పటికిప్పుడు అదృశ్యం కాడు. కానీ ఒక వేళ అదృశ్యమైతే పరిస్థితి ఏలా ఉంటుందో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే భూమిపై చాలా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. చంద్రుడు, భూమి తన అక్షం మీద తిరిగే కోణాన్ని (Axial Tilt) స్థిరీకరిస్తాడు. సముద్రపు ఆటుపోట్లను నియంత్రిస్తాడు. దీర్ఘకాలిక వాతావరణాలను ప్రభావితం చేస్తాడు.

ఒక వేళ చంద్రుడు లేకపోతే భూమిపై అస్థిరంగా రుతువులు, బలహీనమైన ఆటుపోట్లు ఏర్పడుతాయి. ఇది భూమిపై జీవజాలంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చంద్రుడు లేకపోతే భూమి వేగం అదుపు తప్పుతుంది. చాలా వేగంగా తిరుగుతుంది. రోజు నిడివి తగ్గుతుంది. భారీ గాలులు, తుఫానులు సంభవిస్తాయి.

Exit mobile version