NTV Telugu Site icon

Health: మిమ్మల్ని తరచూ డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా? అయితే ఈ ఐదు రకాల టీని ట్రై చేయండి.. అలర్జీకి చెక్‌ పెట్టండి

Remedie For Dust Alergy

Remedie For Dust Alergy

Remedie For Dust Allergy: వాతావరణ మార్పు, సిజన్‌ చేంజ్‌ వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల జలుబు, తుమ్ములు వంటి ఇతర అలర్జీ సమస్యలు బాధిస్తుంటాయి. దీనికి మెయిన్‌ రీజన్ డస్ట్‌ ఎలర్జీ. అదే జలుబు, తమ్ములకు ప్రధాన కారణం అవుతుంది. ఇక చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మనం వింటర్ సీజన్లోకి అడుగుపెట్టాం. ఇక చాలా మందిని పలు అలర్జీ సమస్యలు వెంటాడుతాయి. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు కొన్ని ఆయుర్వేద పద్దతులు ఉన్నాయి. ఈ అయిదు రకాల రెమెడిస్‌ పాటించి మీ డస్ట్‌ ఎలర్జీకి చెక్‌ పెట్టోచ్చు. మరి అవేంటో ఇక్కడ చూద్దాం.

పసుపు పాలు
పుసుపు ఆంటిబయోటిక్‌ అనే విషయం అందరికి తెలిసిందే. దీని ద్వారా సీజనల్‌ వ్యాధులను కాస్తా అరికట్టవచ్చు. లేదా ముందు నుంచి వాడటం వల్ల సీజనల్‌ వ్యాధులకు దూరంగా ఉండోచ్చు. ఎంతో మంచి ఔషధ గుణాలు ఉన్న ఈ పసుపు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దివ్వ జౌషధంగా పని చేస్తోంది. ముఖ్యంగా పసుపు పాలు అనేక సమస్యలకు నివారిణిగా పరిగణించబడుతుంది. మీరు తరచుగా డస్ట్ అలర్జీతో బాధపడుతుంటే పసుపు పాలు తాగండి. ఒక కప్పు పాలలో అర టీస్పూన్ పసుపు వేసి.. వేడి చేసి ఆపై తేనె కలుపుకుని నిద్రపోయే ముందు తాగాలి. ఇది మీ అలెర్జీని తొలగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పసుపు సహజమైన డీకాంగెస్టెంట్‌గా పనిచేస్తుడమే కాదు అలర్జీలకు కారణమయ్యే హిస్టామిన్‌ విడుదలను తగ్గిస్తుంది.

పుదీనా టీ
డస్ట్ అలర్జీని అరికట్టడంలో మరో బెస్ట్‌ రెమెడీ పుదీనా టీ. జలుపు, దగ్గు వంటి సమస్య ఉన్నప్పుడు పుదీన టీ ఇన్‌స్టాంట్‌గా ఉపశమనం ఇస్తుంది. అలాగే తరచూ తీసుకోవడం వల్ల కూడా అలర్జీకి దూరంగా ఉండోచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక కప్పు నీటిని తీసుకుని వాటిని మరిగించాలి. మరిగెటప్పుడు 10 నుంచి 12 పుదీనా ఆకులు వేసి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత ఆ నిటీని వడకట్టి ఒక టెబుల్‌ స్పూన్‌ తేనె కలిపి తాగాలి. పుదీనాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, డీకాంగెస్టెంట్ లక్షణాల వల్ల తుమ్ములు, దగ్గు, ముక్కు కారడం వంటి డస్ట్ అలర్జీ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

తేనె
ఆయుర్వేదంలో తేనెకు చాలా ప్రాముఖ్యత ఉంది. దాని లక్షణాల కారణంగా ఇది అనేక సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. డస్ట్ అలర్జీ నుండి ఉపశమనం పొందడానికి మీరు తేనెనను ఉపయోగించవచ్చు. రోజూ రెండు టీస్పూన్ల తేనెను తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన అలర్జీల నుంచి ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది.

గ్రీన్ టీ
గ్రీన్ టీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది అందరికి తెలుసు. కానీ చేదుగా ఉండటం వల్ల చాలా మంది గ్రీ టీని ఇష్టపడరు. కానీ ఇది రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సాధారణంగా చాలా మంది దీనిని బరువు తగ్గడానికి ఉపయోగిస్తారు. కానీ గ్రీన్ టీ బరువు తగ్గించడమే కాదు.. యాంటీఆక్సిడెంట్ రిచ్ గ్రీన్ టీ అలర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా దుమ్ము, ధూళి వల్ల కలిగే అలర్జీలను నివారించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఆవు నెయ్యి
మీరు తరచుగా డస్ట్ అలర్జీతో ఇబ్బంది పడుతుంటే ఆవు నెయ్యి చక్కటి పరిష్కారం. ప్రతి రోజు ఉదయం మీ ముక్కులో రెండు చుక్కల స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయడం వల్ల అలర్జీలు, దుమ్ము పురుగుల నుండి రక్షించడానికి ఒక రక్షిత పొర ఏర్పడుతుంది. ఇది దగ్గు, తుమ్ము మరియు ముక్కు కారడం వంటి లక్షణాలను ప్రేరేపించకుండా దుమ్ము కణాలను నిరోధిస్తుంది.