చాలా మంది వ్యక్తులు వేరే ప్రదేశాలను సందర్శించడానికి పలు నగరాలకు వెళతారు. ఈ నగరాల్లో బస చేసేందుకు హోటల్‌ను ఎంచుకుంటుంటారు. ఆ హోటల్ నుంచి వెళ్లే టప్పుడు ఏదో ఓ వస్తువును వదిలేస్తారు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. కొన్ని వస్తువులు సురక్షితంగా తిరిగి పొందుతారు. కానీ.. కొన్ని వస్తువులు తిరిగి పొందలేరు. వాటికి సంబంధించిన డేటాను Hotel.com వెబ్‌సైట్ లో పొందుపరిచారు. ఈ వెబ్ సైట్ ఇటీవల ఒక టూరిజం వెబ్‌సైట్ ఒక డేటాను షేర్ చేసింది.
READ MORE: Heart Attack: పెళ్లయిన ఐదు రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి..
400 కంటే ఎక్కువ హోటళ్ల డేటా ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. వ్యక్తులు హోటల్ నుంచి బయలుదేరే సమయంలో ఈ రకమైన వస్తువులను వదిలిపెడుతుంటారట. అందులో ఫోన్ ఛార్జర్‌లు, పవర్ బ్యాంక్‌లు, బట్టలు, పవర్ అడాప్టర్‌లు, మేకప్ కిట్ లు, అడాప్టర్లు, లోదుస్తులు ఎక్కువగా వదిలేస్తారట. 10% హోటల్‌లలో అతిథులు పళ్ల సెట్ , విలువైన వస్తువులను విడిచిపెట్టారట. వాటిని వెబ్‌సైట్ ప్రజలతో పంచుకుంది.
READ MORE:US Economy : ప్రమాదంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ.. 452 కంపెనీలు దివాళా!
రోలెక్స్ వాచీల నుండి లగ్జరీ కార్ కీలు..
హోటల్ గదుల్లో మిగిలిపోయిన కొన్ని ఖరీదైన వస్తువులలో రోలెక్స్ వాచ్, 6 మిలియన్ డాలర్లు (రూ. 50 కోట్లు) నగదు, హెర్మేస్ బిర్కిన్ బ్యాగ్, లగ్జరీ కార్ కీలు, పత్రాలు, కారు టైర్, ఎంగేజ్‌మెంట్ రింగ్ కూడా ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఇంతే కాకుండా డబ్బు, పెంపుడు బల్లి, కోడిపిల్ల మర్చిపోయారట. బల్లి, కోడిని హోటల్ యజమానులు ఓనర్లకు అప్పగించారని నివేదికలో పేర్కొన్నారు.