ఆటలు, సరదాలు.. బాల్యం అదో అనుభూతి.. జీవితంలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎన్నో అనుభూతులు కళ్ల ముందు కనిపిస్తాయి… అవన్నీ ఒకప్పుడు.. ఇప్పుడు అవేం కనిపించడం లేదు. ఆటలంటే స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ మాత్రమే. ఒకప్పుడు ఒంటినిండా చెమట పట్టి, ఆరోగ్యం వచ్చేది. కానీ ఇప్పుడు ఏసీ రూముల్లో మంచాల మీద, కుర్చీల్లో, సోఫాల్లో కూర్చుని ఆడేసుకుంటున్నారు. శరీరక సౌష్టవం కోసం, మానసిక ఉల్లాసం కొరకు తర తరాలనుంచి ఆటలు ఒక అద్భుతమైన సాధవముగా ఆటలు మనం పరిగణిస్తుంటాం. మన వాళ్ళు రక రకాల ఆటలు ఆడుతూ ఉండేవారు. కానీ.. ప్రస్తుతం పిల్లలందరూ ఫోన్‌కి అడెక్ట్ కావడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. తాజా అధ్యయనంలో మరో కీలక అంశం బయట పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
READ MORE: Vijay: విజయ్ పార్టీ కీలక తీర్మానం.. సీఎం స్టాలిన్ టార్గెట్‌గా విజయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం పిల్లలు రాత్రుల్లో ఫోన్ చూడటం అలవాటు చేసుకున్నారు. రాత్రి ఒంటిగంటయినా నిద్ర పోకుండా ఫోన్ చూస్తూనే ఉంటారు. అలాంటి వారిని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం హెచ్చరించింది. 13-19 ఏళ్లు పిల్లలకు అధిక రక్తపోటు ముప్పు పెరుగు తున్నట్టు త్వరగా నిద్ర పట్టకపోవటం, పట్టినా మధ్యలో మెలకువ రావటాన్ని నిద్రలేమి సమస్యగా భావిస్తారు. కంటి నిండా నిద్రపోయే పిల్లలతో పోలిస్తే ఈ నిద్రలేమితో సతమయ్యేవారికి, అలాగే నిర్ణీత 7.7 గంటల కన్నా తక్కువసేపు నిద్రించేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుండటం ఆందోళనకరం.
READ MORE: Tollywood : ఇది హీరోల పైత్యమా?… PROల పైత్యమా?
నిద్రలేమి సమస్య లేకపోయినా 7.7 గంటల కన్నా తక్కువసేపు నిద్రించే పిల్లలకూ సుమారు మూడు రెట్లు రక్తపోటు పెరిగే ప్రమాదముందని అధ్యయనం తేలింది. కౌమారదశ పిల్లలకు రాత్రిపూట రోజుకు 8-10 గంటల నిద్ర అవసరం కానీ బడికి వెళ్లే విద్యార్థులు సగటున కేవలం 6.5 గంటల సేపు మాత్రమే నిద్రిస్తున్నారని అంచనా వేసింది. ఇది పిల్లల ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. రక్తపోటు పెరిగితే గుండెజబ్బుల ముప్పు పెరుగుతుంది.