Site icon NTV Telugu

Simple Happiness Tips: సంతోషంగా ఉండటానికి.. సైన్స్ చెప్పిన సింపుల్ టిప్స్ ఇవే!

Simple Happiness Tips

Simple Happiness Tips

Simple Happiness Tips: సంతోషానికి అసలైన అర్థం మీలో ఎంత మందికి తెలుసు.. వాస్తవానికి సంతోషం అంటే ఏమిటి? నిజంగా చెప్పండి ఈ ప్రశ్నను మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారైనా వేసుకున్నారా?. వేసుకొని ఉంటే దానికి సరైన సమాధానం మీకు లభించిందా?. చాలా మంది అభిప్రాయంలో ఈ ప్రశ్నకు సమాధానం అంత సులువుగా దొరకదని వచ్చింది. సరే మరి సైన్స్ మనం సంతోషంగా ఉండటానికి కొన్ని సింపుల్ టిప్స్ ఇచ్చింది. ఈ స్టోరీలో ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

READ ALSO: TPL : హైదరాబాద్ వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం

స్నేహానికి వయసుతో సంబంధం ఉండదు. కొత్త ఫ్రెండ్‌షిప్‌ను స్వాగతించేందుకు మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి యుక్త వయసులో స్నేహం అనేది సంతోషానికి చిరునామాగా ఉంటుందని వెల్లడించారు. మీరు గమనిస్తే చాలా మంది పెద్దవారు వారికి బాగా తెలిసిన వ్యక్తులతోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తూ సోషల్ మీడియాను పరిమితం చేసుకుంటూ హ్యాపీగా జీవిస్తున్న విషయం అవగతం అవుతుంది. ఎన్ని యుగాలు మారిన స్నేహమనేది స్వచ్ఛమైనది. ఎక్కువ సంతోషాన్ని అందించి, తక్కువ టెన్షన్లను ఇచ్చే స్నేహితులతో సమయాన్ని గడపడానికి టైం కేటాయించుకోండి. నిజానికి మన వ్యక్తిత్వం మరింత పరిణతితో ఉన్నప్పుడే, మనం మరింత మందితో స్నేహం చేసే అవకాశం పొందుతాం. దీంతో శారీరక ఆరోగ్యంతో పాటు కాగ్నిటివ్ ఫంక్షన్ మెరుగుపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.

కేవలం మీరు, మీకోసం అని జీవిస్తూ ఉండటం కంటే.. సాటి వారి కోసం ఏదైనా చేసినప్పుడు మీరు పొందే అనుభూతి చాలా బాగుంటుందని పేర్కొన్నారు. నిజానికి ఒత్తిడి, దీర్ఘకాలిక రుగ్మతలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు వలంటీర్‌గా సాయపడటం మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.2002లో చేపట్టిన ఒక అధ్యయనంలో.. దీర్ఘకాలిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వలంటీర్లు ఇతరులకు సాయం చేసినప్పుడు తక్కువ బాధను అనుభవించారని వెల్లడైంది.

స్నేహానికి నిజమైన పునాది దయ. మీ ఫ్రెండ్స్‌కు ఏదైనా సాయం అవసరమైనప్పుడు మీరు చూపించే దయ, మీ బంధాన్ని మరింత బలంగా మార్చేందుకు సాయపడుతుందని పరిశోధకులు తెలిపారు. అలాగే సంతోషాన్ని పంచుకోవడం కూడా స్నేహానికి పునాది వంటిదని చెబుతున్నారు. పలు అధ్యయనాల ప్రకారం.. స్నేహంలో సంతోషాలను పంచుకోవడం తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. అయితే ఫ్రెండ్‌షిప్‌లను కొనసాగించడంలో దయ, కరుణ ఎంత ముఖ్యమో, సంతోషాలను పంచుకోవడం కూడా అంతే ముఖ్యం అని అన్నారు.

మన ఇంట్లో పెద్దవారితో మాట్లాడం చేస్తుంటే మీకు మానసికంగా పలు ప్రయోజనాలను లభిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే మీకు జరిగిన మూడు విషయాలను కచ్చితంగా ఒక పేపర్‌పై రాసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. అలా రాసుకున్నప్పుడు మన మానసిక స్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు గడిపిన జీవితంలో మీ జీవితాన్ని మలుపుతిప్పే క్షణాలు ఏమైనా ఉంటే వాటిని ఒక దగ్గర రాసుకోవడం ద్వారా మనలో సంతోషం స్థాయి పెరుగుతుందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఏదీ చేయకుండా కాసేపు కూర్చోండి. నిజానికి ఈ సలహా కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ సంతోషంగా ఉండేందుకు ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన చెందడం అనేవి మీ హ్యాపీనెస్‌ను దూరం చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. సంతోషం గురించి ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం, దాని గురించి రాయడం, చదవడం, దాని ప్రాధాన్యత తెలుసుకోవడం వంటి వాటి ద్వారా కొందరు వారి జీవితంలో నిజమైన సంతోషాన్ని దూరం చేసుకుంటారని ఒక థియరీ ఉంది తెలుసా. ఇలా సంతోషం గురించి తెలుకొని, ఆ సంతోషం వారి జీవితంలో లేదని నిరుత్సాహ పడుతురాని ఈ థియరీ చెబుతోంది.

READ ALSO: KCR : ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వమా..?

Exit mobile version