మనం ఎక్కువగా తీసుకొనే పండ్లలో ఫైనాఫిల్ కూడా ఒకటి.. ఈ పండు గుచ్చుకున్నట్లు ఉన్నా కూడా దీన్ని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయి.. పుల్ల పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. అందుకే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈ పండు మనకు అన్ని కాలాల్లో లభిస్తూ ఉంటుంది. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మరి ఎప్పుడు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పండులో విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్, ఫోలేట్, కాపర్, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిలో ఎంజైమ్ లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మనకు ఎంతగానో సహాయపడతాయి.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.. మలబద్ధకం సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.. గర్భిణీ స్త్రీలు కూడా పైనాపిల్ కు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
బరువు తగ్గడం కోసం డైట్ చేసేవారు.. ఫైనాఫిల్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. గాయాలు త్వరగా మానుతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృడంగా తయారవుతాయి.. రక్తపోటుతో బాధపడే వారు పైనాపిల్ ను తీసుకోవడం మంచిది.. ఇంకా అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
