Site icon NTV Telugu

New Year 2024 : న్యూ ఇయర్ రోజు ఇలాంటి పనులు అస్సలు చెయ్యకండి…!

Happy New Year 2024

Happy New Year 2024

2023 ఏడాదికి ముగింపు పలికేసి అందరు ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.. గత రాత్రి 12 గంటల నుంచి కొత్త ఏడాది సంబరాల్లో జనాలు మునిగి తేలుతున్నారు.. ఈ కొత్త సంవత్సరం రోజు పాతవి పూర్తిగా మారిపోయి, కొత్త ఏడాదిలో సంతోషంగా బ్రతకాలని అందరు అనుకుంటారు.. ఎన్నో పరిహారాలు చేయాలి, ఇలా చేయడం వల్ల జీవితం సుఖశాంతులతో నిండి ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరం మొదటి రోజున కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి.. అప్పుడే మన జీవితం హాయిగా ముందుకు సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఈరోజు ఎం చెయ్యకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈరోజు ఎంత ఆనందంగా ఉంటే అంత మంచిదని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, కొత్త సంవత్సరం మొదటి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత విష్ణువు, లక్ష్మిని పూజించండి. ఈ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి. దీని తరువాత, దానిని ఎర్రటి గుడ్డలో చుట్టి భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.

నూతన సంవత్సరం మొదటి రోజు భక్తిపూర్వకంగా పేదలకు దానం చేయండి.. మనకు అంతా మంచే జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు.. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి లభిస్తాయని నమ్ముతారు. అలాగే రాగి కప్పులో నీళ్లు నింపి అందులో కుంకుమపువ్వు వేయాలి. ఆ తర్వాత , శివలింగానికి సమర్పించండి. ఈ సమయంలో ‘ఓం మహాదేవాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి.. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి.. ఇక అలాగే ఈరోజు ఎవరికి మాటలతో దూషించకండి.. పదునైన వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు లేదా ఉపయోగించకూడదు… ఇవి గుర్తుంచుకోండి..

Exit mobile version