NTV Telugu Site icon

New Clothes : కొత్త బట్టలను అలానే వేసుకుంటున్నారా? ఆ సమస్యలు వస్తాయి జాగ్రత్త..

New Clothes

New Clothes

కొత్త బట్టలను చూడగానే చాలా మందికి వేసుకోవాలనే కోరిక ఉంటుంది.. ఇక పండుగ సీజన్ లలో వరుస ఆఫర్స్ పెట్టడంతో చాలా మంది కొనుక్కోవడం ఆలస్యం, కట్టడం వెంట వెంటనే జరిగిపోతుంది.. ఇక లేడీస్ అయితే ఏది కొనాలో తెలియక తర్జన భర్జన పడుతూంటారు. అన్ని ఆఫర్లు ఉంటాయి. ఇక ఎలాగో మనకు కావాలిగా.. ఎలాగో ఆఫర్లలో ఉన్నాయి. ఇలా వేరే వేరే ఆకేషన్స్ కి కూడా ముందుగానే కొని దాచి పెడుతూంటారు. ఇక ఆ కొత్త బట్టలను ఎప్పుడు వేసుకుందామా.. కొత్త బట్టలను పదిమందికి చూపిద్దామా అని తెగ ఆత్రంగా ఉంటారు..

అయితే ఒక్కడే చాలా మంది తప్పులు చేస్తూంటారు. కొత్త బట్టలను నేరుగా వేసేసుకుంటారు. చాలా మంది ఇంతే. కొత్త బట్టలను వాష్ చేయకుండా నేరుగా వేసుకుంటారు. ఇలా వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయం ఎవరికీ తెలీదు. ఏంటి షాక్ అవుతున్నారా.. ఇది నిజం దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త బట్టలను స్టోర్ చేసే ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు.. ఎక్కడెక్కడో పెట్టుకొని తీసుకొస్తారు.. దాంతో క్రీములు కూడా ఎక్కుతాయి.. బ్యాక్టీరియా, సూక్ష్మీ జీవులు తప్పకుండా ఉంటాయి. అందుకే కొత్త బట్టలను యూజ్ చేసే ముందు ఒకసారి వాస్ చేసుకుని వాడాలి..

ఇక బట్టలను తయారు చేయడానికి అనేక రసాయనాలను యూజ్ చేస్తూంటారు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా రెడీమెడ్ బట్టలు ఎక్కువగానే లభ్యం అవుతున్నాయి. వీటి తయారీలో వివిధ రంగులు, ఇతర రసాయనాలను ఉపయోగించి ఉంటారు. బట్టలను కొన్ని సార్లు పాలిష్ చేయడంలో, ప్రింటింగ్ చేయడంలో ఇలా వాటిలో అనేక రసాయనాలను ఉపయోగిస్తారు.. అందుకే క్లీన్ చేసి వాడటం మంచిది..

కొత్త బట్టలను ఎప్పుడైనా వేసుకున్నాక.. దురద, చిరాకుగా ఉంటాయి. దానికి కారణం వాటిలో ఉండే బ్యాక్టీరియా. అలాగే కొత్త బట్టలు చమటను, నీటిని ఎక్కువగా గ్రహించలేవు..

ఇకపోతే పిల్లలు, గర్భి ణీలు కొత్త బట్టలను వేసుకోవాలనుకుంటే.. ఖచ్చితంగా వాటిని వాష్ చేసే ధరించాలి. దీని వల్ల వారికి సౌకర్యవంతంగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.. సో అది విషయం.. అందుకే ఇక ఎప్పుడు కొన్నా ఉతికి ఆరిన తర్వాత వేసుకోవడం మంచిది..