Mushroom Masala Recipe: మష్రూమ్ మసాలా కర్రీ అనేది వెజిటేరియన్ వంటకాలలో ప్రధానంగా చూస్తుంటాము. ఇది రుచికరమైన, పోషకాలతో నిండిన వంటకం. ఈ కర్రీలో మంచి మసాలాలతో మిక్స్ అయిన మష్రూమ్‌లు నోరూరించే కర్రీకి రూపమిస్తాయి. దీనిని రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేయవచ్చు. ఈ మష్రూమ్ మసాలా కర్రీ మసాలా గ్రేవీతో కాంబినేషన్‌లో ఉండే మష్రూమ్ టెక్స్చర్ అద్భుతంగా ఉండడంతో చపాతీ, నాన్, జీరా రైస్‌లకు సరైన జోడీగా నిలుస్తుంది. మరి ఇంతటి అద్భుత వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా..
India Post: తపాలా సేవల్లో విప్లవాత్మక మార్పు.. చరిత్రలోకి రిజిస్టర్డ్ పోస్టల్!
మష్రూమ్ మసాలా కర్రీ తయారీ విధానం:
అవసరమైన పదార్థాలు:
మష్రూమ్ – 200 గ్రాములు (సాఫ్ట్‌గా తరిగినవి).
ఉల్లిపాయలు – 2 (చిన్న ముక్కలుగా తరిగినవి).
టమాటాలు – 2 (పేస్ట్ లేదా బాగా మెత్తగా మిక్స్ చేసినవి).
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్.
పచ్చిమిర్చి – 2.
మిరప పొడి – 1 టీస్పూన్.
ధనియాల పొడి – 1 టీస్పూన్.
జీలకర్ర పొడి – అర టీస్పూన్.
గరం మసాలా – అర టీస్పూన్.
పసుపు – పావు టీస్పూన్.
ఉప్పు – రుచికి సరిపడా.
నూనె – 2 టేబుల్ స్పూన్లు.
కొత్తిమీర – అవసరమైనంత.
నీరు – అవసరమైనంత.
Viral News: అంబానీ కంటే ధనవంతురాలిగా మారిన చనిపోయిన మహిళా.. అకౌంట్లోకి 1.13 లక్షల కోట్లు జమ!
తయారీ విధానం:
ముందుగా మష్రూమ్స్ (పుట్ట గొడుగులు)ను శుభ్రంగా కడిగి, మధ్యకు రెండుగా తరిగి ఉంచండి. ఆ తర్వాత ఒక పాన్‌లో నూనె వేసి జీలకర్ర వేయండి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించండి. ఆపై టమాటా పేస్ట్ వేసి, బాగా ఉడకబెట్టండి. ఆయిల్ పక్కకు వచ్చేంత వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు అందులో మిరప పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపండి.
ఇలా అన్ని వేశాక మసాలా బేస్ రెడీ అయిన తర్వాత తరిగిన మష్రూమ్‌లు వేయాలి. అలా వేసిన తర్వాత మష్రూమ్‌ల నుంచి కాస్త తేమ వస్తుంది. దానితో అవి కొద్దిగా కుంచించుకుంటాయి. అవసరమైనంత నీరు పోసి, మూతపెట్టి ఓ 10 నిమిషాలు మరిగించండి. చివరగా గరం మసాలా పొడి వేసి మిక్స్ చేసి, కొత్తిమీరతో గార్నిష్ చేయండి.అంతే మనకు కావలిసిన రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా రెసిపీ తయారీ అవుతుంది. ఇక ఆ మష్రూమ్ మసాలా కర్రీను చపాతీ, రోటీ, నాన్, లేదా జీరా రైస్, ప్లేన్ రైస్ తో సర్వ్ చేయవచ్చు.
