NTV Telugu Site icon

Lip Lock : లిప్ లాక్ చేసేవారికి షాకింగ్ న్యూస్.. ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి..

Lipkiss

Lipkiss

ఇద్దరు మనసులు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా హగ్ చేసుకోవడం చేస్తారు.. అదే లవర్స్ కలిసినప్పుడు లిప్ కిస్ లు ఇచ్చుకుంటుంటారు.. ప్రేమికులతో పాటూ ఇతరులు కూడా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. లిప్ లాక్ ల వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో అస్సలు ఆలస్యం చెయ్యకుండా తెలుసుకుందాం..

చిన్న పిల్లలను ఇలా కిస్ చెయ్యడం వల్ల ఫ్లూ, వైరస్‌ల బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. సో జాగ్రత్త సుమా..

కొన్ని సర్వేల ప్రకారం లిప్ కిస్ లు ఎక్కువగా చెయ్యడం వల్ల థ్రిల్ ఏమో గానీ అలెర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

అలాగే పంటి, చిగుళ్ల సమస్యలు కూడా వచ్చే అవకాశాలన్నాయంటే నమ్ముతారా? చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు.. కొన్ని రకాల నోటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..

లిప్ కిస్ చెయ్యడం ద్వారా లైంగిక సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.. అలాగే మోనోన్యూక్లియోసిస్, మెనింజైటిస్ వంటి వైరస్‌లను వ్యాపింపజేస్తుంది.. అంతేకాదు జలుబు దగ్గు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.. సో జాగ్రత్త..