Kitchen Safety Tips: బయటి తిండి కొన్ని సార్లు తినబుద్ధి కాక ఇంట్లో వండుకొని తిందామని ప్రయత్నిస్తారు కొందరు. మీకు తెలుసా మీరు కిచెన్‌లో తెలిసీ తెలియక చేసే ఈ పనులతో మీరు తినే భోజనం ఫుడ్ పాయిజన్ అవుతుందని. ఇంతకీ మన ఇంట్లో, మనం వండుకునే ఆహారం ఎందుకు విషతుల్యమైతుందో ఎప్పుడైనా ఆలోచించారా, దీనికి నిపుణులు ఏం చెబుతున్నారు. అసలు ఆహారం వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఎంత మందికి తెలుసు. సరే ఇప్పుడు వీటి గురించి నిపుణుల సూచనలు ఏంటో తెలుసుకుందాం..
READ ALSO: కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్పీచ్
బిజీ లైఫ్‌లో కొందరు రెండు, మూడు రోజులకు సరిపడా ఒకసారే వండుకుని ఫ్రిజ్లో పెట్టుకోవడం, అవసరమైనప్పుడు తిరిగి వాటిని వేడి చేసుకుని తినడం చాలా మామూలు చేస్తున్నారు. ఈ విషయం ముఖ్యంగా అలాంటి వారి కోసమే.. అసలు ఎక్కువ మందిలో తిండి విషయంలో సరైన అవగాహన లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్లో ఆహార పదార్థాలను రోజుల తరబడి నిల్వ ఉంచి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వేడి చేసి తినడం చాలా ప్రమాదకరం అని సూచిస్తున్నారు. ఆహార పదార్థాలను వీలైనంత వరకు పదే పదే వేడి చేయడం మానుకోవాలని చెబుతున్నారు. ఎన్ని ఎక్కువ సార్లు వేడి చేస్తే అంత ఎక్కువ ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. తప్పనిసరైతే ఒక్కసారి మాత్రమే వేడి చేసుకోవాలని, అధిక సార్లు వేడి చేసి తినాల్సి వస్తే, ఆహార పదార్థాన్ని ఒకే పాత్రలో కాకుండా, చిన్న వాటిల్లో నిల్వ ఉంచుకోవాలని సూచిస్తు్న్నారు.
అన్నం : మనం తరచూ వేడి చేసే వాటిలో అన్నం కూడా ఒకటి. ఇందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుందని, చల్లారిన అన్నాన్ని తిరిగి వేడి చేస్తే, ఈ బ్యాక్టీరియా మరింత పెరిగి, విషపదార్థాలను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీని వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
కోడిగుడ్లు : వీటిలో చాలా పోషకాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయం. కానీ కొందరు వండిన గుడ్లను తరుచుగా వేడి చేసి తినడం చేస్తున్నారని, ఇలాంటి వాటి వల్ల గుడ్లలోని పోషక విలువలపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అవి తిన్న వారిలో ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు కనిపిస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా పూర్తిగా ఉడికించని గుడ్లను వేడి చేసి తింటే, వాటిలో ఉండే సాల్మనెల్లా బ్యాక్టీరియా కారణంగా డయేరియా, జ్వరం, వాంతులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
పుట్టగొడుగులు : పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఎక్కువ సమయం గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన అనంతరం వేడి చేసి తింటే, వాటిల్లో బ్యాక్టీరియాలు పెరుగుతుయని చెబుతున్నారు. అంతేకాకుండా వాటి రంగు, రుచి మారుతుందని, అది జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడానికి కారణంగా మారుతుందని పేర్కొన్నారు. ఇవి గుండె జబ్బులకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
బంగాళాదుంపలు : మిగిలిపోయిన బంగాళాదుంప కూరను తిరిగి వేడిచేసి తినడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వండిన బంగాళాదుంపలను సరిగా నిల్వ చేయాలని, లేకపోతే అది గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత క్లోస్ట్రీడియం బోటులినం అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని హెచ్చిరిస్తున్నారు. తిరిగి వేడి చేసినా ఈ బ్యాక్టీరియా నుంచి ముప్పు తొలగదని, ఆలూలో ఉండే నైట్రేట్ల కారణంగా వికారం, వాంతులు అవుతాయని చెబుతున్నారు.
పాలకూర : మిగిలిన పాలకూర కర్రీని ఫ్రిజ్లో పెట్టడం, తినే ముందు వేడి చేయడం వంటివి మంచిది కాదంటున్నారు. వీటిలో ఉండే నైట్రేట్లు అమినో యాసిడ్లతో కలసి క్యాన్సర్ కారకాలైన నైట్రేట్లు, నైట్రోసమైన్లుగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వండిన వెంటనే తినడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
మాంసం : మాంసాన్ని ఎక్కువగా వేడి చేయడం వల్ల దాని ప్రోటీన్ల క్రియాత్మక లక్షణాలు గణనీయంగా ప్రభావితమవుతాయని National Library of Medicine అధ్యయనంలో వెల్లడైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫ్రిజ్లో ఉంచి, తర్వాత వేడి చేసి తినడం వల్ల అందులోని ప్రొటీన్ గట్టిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు సరిగా నిల్వ చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన మాంసం తినాలంటే, 74 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తప్పనిసరిగా వేడి చేయాలని సూచిస్తున్నారు. అప్పుడు మాత్రమే అందులోని బ్యాక్టీరియా చాలా వరకు చనిపోతుందని చెబుతున్నారు.
READ ALSO: Asia Cup 2025 Prize Money: దాయాదుల పోరులో గెలిచిన వాళ్లకు ఎన్ని కోట్లో తెలుసా?
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
