NTV Telugu Site icon

Phone: స్మార్ట్‌ఫోన్ వాడకుంటే.. పరిశోధనలో ఏం తేలింది తెలుసా !

Untitled Design (100)

Untitled Design (100)

స్మార్ట్‌ఫోన్.. ప్రజల పాలిట భూతంలా తగులుకుంది అని చెప్పాలి. లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతుల్లో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అవసరం కొద్దీ వాడేవారికన్నా, అనవసరంగా వాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎలాంటి విషయం అయిన ఈ ఫోన్ ద్వారా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉంటే ప్రపంచమే మన అరచేతిలోకి వస్తుంది. అందుకే, ఫోన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నారు. అయితే ఒక 3 రోజుల పాటు స్మార్ట్‌ఫోన్‌ వాడకపోతే ఏమవుతుంది? తాజాగా ఓ అధ్యయనంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read : Prabhas : ‘ఫౌజీ’లో మరో హీరోయిన్.. ?

* కేవలం మూడు రోజులు అంటే మొత్తం 72 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌కి దూరంగా ఉంటే, మెదడు పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో రీసెంట్‌గా రిసెర్చర్ ల్లో తెలుసుకున్నారు. జర్మనీకి చెందిన హీడెల్‌బర్గ్ యూనివర్సిటీ, కోలోన్ యూనివర్సిటీ సంయుక్తంగా దీనిపై అధ్యయనం నిర్వహించింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 25 మంది పార్టిసిపెంట్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఓ 72 గంటల పాటు స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలని వీరికి కండిషన్ పెట్టారు. కేవలం ముఖ్యమైన కమ్యూనికేషన్, వర్క్ టాస్క్‌లకు వాడుకునే మినహాయింపు ఇచ్చారు.

The Impact of Smartphone Use and Social Media on Young People's Wellbeing - The Kingsley School

* ఇక ఈ 3 రోజుల పాటు వారి బ్రెయిన్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. అయితే వారంతా ధూమపానం, మద్యం సేవించకుండా ఎలా కఠినంగా ఉంటారో.. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగం విషయంలోనూ ప్రవర్తించారని తెలింది. అలాగే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో చాలామందికి గేమింగ్ అలవాటు ఉంది. వారి ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి, డోపమైన్ లేదా సెరోటోనిన్ వంటి మెదడు రసాయనాల స్రావంలో తేడాలు కనిపించాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

* ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వడేవారిలో అనవసరమైన ఆందోళన, అధిక ఆకలి, మరికొందరిలో సైలెన్స్, డిప్రెషన్ వంటి లక్షణాలు ఏర్పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ అధ్యయనంలో పాల్గొన్న తర్వాత వారిలో మార్పులు కనిపించాయని.. వారి మెదడు దానంతట అదే సాధారణంగా పని చేయగలిగుతుందని.. స్వయంగా నిర్ధారణ అయినట్లు పరిశోధకులు వివరించారు. ఈ మూడు రోజులు ఫోన్‌కి ధూరంగా ఉంటేనే ఇన్ని లాభాలు ఉన్నాయి అంటే. అదే సర్వేని ప్రతి ఒక్కరు ఎప్పటికి పాటిస్తే ఇంకెలా ఉంటుంది. అందుకే అప్పట్లో మన పెద్దవారు అంత హెల్దీగా, చురుగ్గా ఉన్నారు. వారి కాలంలో ఫోన్‌లు లేవు ఉన్న కూవా టెలిఫోన్‌లు , కీ బోర్డ్ ఫోన్ లు మాత్రమె ఉన్నాయి. అందుకే వారు ఇప్పటికి శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.