NTV Telugu Site icon

Blood Donor Day: నేడు వరల్డ్ బ్లడ్‌ డోనర్‌ డే.. అరుదైన బ్లడ్‌ గ్రూపులివే..

Blood

Blood

Blood Donor Day: ప్రపంచ మహిళా దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం వంటి రోజులతోపాటు మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్‌షిప్‌ డే, ఇలా ఎన్నో ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. అలానే ఈరోజు(జూన్‌ 14)కు కూడా ప్రత్యేకత ఉంది. ఈరోజు వరల్డ్ బ్లడ్‌ డోనర్స్ డే. అంటే ప్రపంచ రక్తదాన దినోత్సవం. రక్తదానం ఎంత మేలు చేస్తుందంటే.. ఎదుటి వ్యక్తి ప్రాణాలను రక్షించి పునర్జన్మను ఇస్తుంది. కొద్ది రోజుల క్రితం ఒడిషాలో రైలు ప్రమాదం జరగగా.. ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం దానం చేయడానికి చాలా మంది యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. అలాగే చాలా రక్తదాన కేంద్రాలు కొనసాగుతుంటాయి. ఇక ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం కాబట్టి.. రక్తంలో ఎన్ని గ్రూపులు ఉంటాయి.. వాటిలో అరుదైన గ్రూపులేమిటో తెలుసుకుందాం..

Read also: World’s Richest Persons: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు వీరే..!

సాధారణంగా మనిషి రక్తం ప్రధానంగా 4 గ్రూపులుగా ఉంటుంది. వాటిలో A, B, AB, O గ్రూపులుగా ఉంటుంది. వీటిలో పాజిటివ్‌, నెగిటివ్‌ గ్రూపులుంటాయి. ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటిజన్ల ఆధారంగా ఈ గ్రూపులను నిర్ణయిస్తారు. A యాంటిజన్ ఉంటే A గ్రూపు, B యాంటిజన్ ఉంటే B గ్రూపు, రెండూ ఉంటే AB గ్రూపు, అవేవీ లేకపోతే O గ్రూపుగా పరిగణిస్తారు. అలాగే ఎర్ర రక్త కణాలపై RH ప్యాక్టర్ ఉంటే పాజిటివ్‌గా లేకపోతే నెగిటివ్‌గా భావిస్తారు. అంటే ఎర్ర రక్త కణాలపై యాంటిజన్‌తో పాటు RH ఫ్యాక్టర్ కూడా ఉంటే అది పాజిటివ్, లేకపోతే అది నెగిటివ్ అంటారు. వీటిలో ఏబీ నెగిటివ్ చాలా రేర్‌గా దొరుకే బ్లడ్‌ గ్రూప్‌.

Read also: Hyderabad Girl: లండన్ లో తెలంగాణ యువతి మృతి.. కత్తితో దాడి చేసి చంపిన యువకుడు

మన దేశ జనాభాలో ఉన్న వారిలో ఎంత మందికి ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉందంటే.. A పాజిటివ్ బ్లడ్ 21.8%, A నెగిటివ్ బ్లడ్ 1.36%, B పాజిటివ్ బ్లడ్ 32.1%, B నెగిటివ్ బ్లడ్ 2% AB పాజిటివ్ బ్లడ్ 7.7%, AB నెగిటివ్ బ్లడ్ 0.48%, O పాజిటివ్ 32.53%, O నెగిటివ్ బ్లడ్ 2% మందిలో ఉన్నట్టు వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్ సైట్ ప్రకటించింది. ప్రకటించిన గణాంకాల ఆధారంగా దేశం మొత్తం మీద AB నెగిటివ్ బ్లడ్ 0.48% మందిలో మాత్రమే లభ్యమవుతుండగా, ఏ నెగిటివ్‌, ఒ నెగిటివ్, బి నెగిటివ్ రక్తం కూడా అతి కొద్ది మందిలో మాత్రమే ఉంది. AB పాజిటివ్, AB నెగిటివ్, ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపులతో పాటు మరో రెండు అత్యంత అరుదైన గ్రూపులు కూడా ఉన్నాయి. అందులో ఒకటి బాంబే బ్లడ్ గ్రూపు అయితే రెండోది గోల్డెన్ బ్లడ్ గ్రూపు. ఇదేంటీ బాండే బ్లడ్‌ గ్రూప్‌.. గోల్డెన్‌ బ్లడ్‌ గ్రూప్‌ అనుకుంటున్నారా? ఇది నిజం. కాకపోతే ఈ రెండు బ్లడ్‌ గ్రూపులు చాలా తక్కువ మందిలో ఉంటాయి.

Read also: Pawan Kalyan Varahi Yatra: అన్నవరంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక పూజలు

బ్లడ్ గ్రూపులు ఇంగ్లిష్ అక్షరాలైన ఎ, బి, ఓ లాంటి పేర్లతో ఉంటే.. ఈ బాంబే బ్లడ్ గ్రూప్ మాత్రం ఒక నగరం పేరుతో ఉంది. అందుకు కారణం.. మొదట 1952లో దీనిని భారత్‌లోని మహారాష్ట్ర రాజధాని బాంబేలో గుర్తించారు. వైఎం భెండె ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు. అసలు ఈ గ్రూపు ఒకటి ఉందన్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఈ గ్రూపు రక్తం ఉన్న వారు తమది ‘O’ గ్రూపు రక్తం అనుకుంటారు. కానీ రక్తదానం తర్వాత ఆ రక్తాన్ని’O’ గ్రూపు వారికి ఎక్కిస్తున్నప్పుడు వారికి మ్యాచ్ కానప్పుడు, అపుడు ప్రత్యేక పరీక్షల ద్వారా మాత్రమే వారి బ్లడ్ గ్రూపు బాంబే బ్లడ్‌ గ్రూప్‌ అని తెలుస్తుంది. ఇది కేవలం ప్రతి 10 వేల మందిలో ఒక్కరిలో మాత్రమే ఉంటుంది. ఈ బ్లడ్‌ గ్రూప్ ఉన్నవారు ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు. ఇది వంశపారంపర్యంగా రావడమే దీనికి కారణం. ఈ రక్తం ఒక తరం నుంచి మరో తరానికి వస్తోంది. మరొక బ్లడ్‌ గ్రూప్‌ గోల్డెన్ బ్లడ్ గ్రూపు. ఆ పేరులోనే అది ఎంత ప్రత్యకమో అర్థమవుతుంది. ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారు ఇతరులకు రక్తాన్ని ఇవ్వొచ్చు.. కానీ వారికి రక్తం అవసరమైనప్పుడు మాత్రం దాతలు దొరకకపోవడం చాలా బాధకరం. గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్‌ నల్(Rh null). ఈ గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటిజెన్ ఉండదు. అందుకే దీన్నీ ఆర్‌హెచ్‌ నల్(Rh null) అని పిలుస్తారు. ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది. వంశపారంపర్యంగానే ఇలా జరుగుతుందని, దీనికి వారి తల్లిదండ్రులిద్దరూ కారణమవుతారని కొలంబియా జాతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు ప్రకటించారు.