NTV Telugu Site icon

Silver Fish Drink: ఈ డ్రింక్‌ ధర 5 వేల రూపాయలా? అంతగా ఏముంది అందులో..

Silver Fish Drink

Silver Fish Drink

Silver Fish Drink: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రింక్ లలో లైవ్ ఫిష్ డ్రింక్ ఒకటి. లైవ్ ఫిష్ డ్రింక్ జపాన్ చెందిన ఇష్టమైన పానీయం. ఈ పానీయం ఒక కప్పులో దాదాపు 200 చిన్న చేపలు ఉంటాయి. ఈ చేపలలో ప్రతి ఒక్కటి సజీవంగా ఉండాయి. ఎంతో నైపుణ్యంతో తయారుచేసిన లైవ్ ఫిష్ డ్రింక్ ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన పానీయంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ పానీయం ఒక కప్పుకు దాదాపు $60 ఖర్చవుతుంది, అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 5 వేల వరకు ఉంటుంది. దీనినే డ్యాన్సింగ్‌ ఈటింగ్ అంటారు.

అతి చిన్న సిల్వర్‌ చేపలను సోయా సాస్‌లో తయారుచేసిన పదార్థాలతో కలిపి అవి బతికి ఉన్నప్పుడే తాగుతారు. చిన్న సిల్వర్‌ చేపలను బ్యాక్టీరియా ఉండదు. అంతేకాదు, సిల్వర్ ఫిష్ బతికుండగా తాగి చనిపోతే కొద్ది నిమిషాల్లోనే కుళ్లిపోవడం మొదలు అవుతాయట. చేపలు సజీవంగా ఉన్నందున, ఈ పానీయం తాగేటప్పుడు చేపలు కప్పు నుండి ఎగిరి కింద పడతాయట. అందుకే ఈ డ్రింక్ తాగడం ఒక ఆర్ట్‌ అని కూడా అంటారు. చేపలు పైకి క్రిందికి గెంతుతాయి కాబట్టి, సిల్వర్ ఫిష్ కప్పులో నుండి కిందికి జారిపోకుండా జాగ్రత్తగా తాగాలని జపనీయులు చెబుతారు. ఈ లైవ్ ఫిష్ డ్రింక్ గొప్ప రుచినే కాకుండా బలమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని జపనీయులు అంటున్నారు.
Patnam Mahender Reddy: నా ఫామ్ హౌజ్ పక్కనే సబితా, పొంగులేటి ఫామ్ హౌజ్ లు ఉన్నాయి..