Site icon NTV Telugu

Sara Tendulkar Skin Secret: సారా టెండూల్కర్ గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్.. సింపుల్‌గా మీరు కూడా ట్రై చేయొచ్చు..

Sara Tendulkar

Sara Tendulkar

Sara Tendulkar Skin Secret: లెజెండరీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ అంటే తెలియని వారు ఉండరు.. తన అందం, ఫ్యాషన్ స్టైల్‌తో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె మెరిసే చర్మం గురించి అభిమానులు తరచూ ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల ఆమె తన గ్లోయింగ్ స్కిన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రహస్యాలను వెల్లడించింది. అవి కూడా పెద్ద ఖర్చు లేకుండా.. సింపుల్‌గా అందరూ ట్రై చేసే విధంగా ఉన్నాయి..

ఖరీదైన ఉత్పత్తులు కాదు.. సరళమైన పద్ధతి
ఈ రోజుల్లో చాలా మంది ఖరీదైన స్కిన్‌ కేర్ ఉత్పత్తులు లేదా 10–15 స్టెప్స్ ఉన్న రొటీన్‌ను అనుసరిస్తుంటారు. అయితే సారా టెండూల్కర్ మాత్రం సరళమైన చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం మరియు సరిపడా నీరు త్రాగడం వంటి పద్ధతులే నిజమైన అందం రహస్యమని చెబుతోంది.

సున్నితమైన చర్మం కావడంతో జాగ్రత్తలు
సారా తన చర్మం చాలా సున్నితంగా ఉంటుందని తెలిపింది. మొటిమలు వచ్చే అవకాశం ఉండటంతో ఆమె స్కిన్‌ కేర్ ఉత్పత్తులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది. సాధారణంగా ఆమె సున్నితమైన క్లెన్సర్, తేలికపాటి మాయిశ్చరైజర్ మరియు సన్‌స్క్రీన్ మాత్రమే ఉపయోగిస్తుందని చెబుతోంది.

ఎక్కువ ప్రయోగాలు చేయదు
తన చర్మంపై ఎక్కువ ఉత్పత్తులతో ప్రయోగాలు చేయడం తాను ఇష్టపడనని సారా తెలిపింది. బదులుగా క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ మరియు సన్‌స్క్రీన్ వంటి ప్రాథమిక దశలను క్రమంగా పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆమె అభిప్రాయం.

PCOS సమస్యతో పోరాటం
సారా టెండూల్కర్‌కు Polycystic Ovary Syndrome (PCOS) సమస్య కూడా ఉంది. ఈ కారణంగా ఆమెకు ఒకప్పుడు జిడ్డుగల చర్మం మరియు మొటిమల సమస్యలు ఎదురయ్యాయి. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆమె ఈ సమస్యలను నియంత్రించగలిగింది.

ఆరోగ్యకరమైన అలవాట్లు ముఖ్యం
మెరిసే చర్మానికి ఖరీదైన క్రీములు అవసరం లేదని సారా చెబుతోంది. మంచి అలవాట్లు ఉంటే చర్మం సహజంగా మెరిసిపోతుందని ఆమె అభిప్రాయం. ముఖ్యంగా.. రోజూ తగినంత నీరు త్రాగడం.. రోజుకు 7–8 గంటల నిద్ర.. సమతుల్య ఆహారం తీసుకోవడం.. ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ నూనె పదార్థాలను తగ్గించడం.. అవసరమైతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం.. ఈ సరళమైన అలవాట్లను పాటిస్తే ఎవరికైనా ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం పొందవచ్చని సారా టెండూల్కర్ చెబుతున్నారు..

Exit mobile version