NTV Telugu Site icon

Rare ENT Surgery: పూర్తి వినికిడి లోపం చిన్నారులకు అరుదైన ఈఎన్‌టీ ఆపరేషన్

Ent1

Ent1

పుట్టుకతోనే పూర్తి వినికిడి లోపంతో పుట్టిన ముగురు చిన్నారులకు అరుదైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలోని మైక్రోకేర్ ఈఎన్ టీ ఆస్పత్రి (MicroCare ENT Hospital) వైద్యులు. నగరానికి చెందిన బోసిల్ అహ్మద్ (15 ఏళ్ళు), ఎల్మాగ్ డాడ్ (ఏడేళ్ళు) అబ్దిల్ అహ్మద్ (ఏడాది) కి కోషెల్లార్ ఇంప్లాంటేషన్ అనే అత్యంత క్లిష్టమయిన సర్జరీని మైక్రోకేర్ ఈఎన్ టీ ఆస్పత్రి వైద్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వైద్యశాల CHIEF డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్‌ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచం లోనే అరుదుగా జరిగే శస్త్ర చికిత్స ల్లో ఒకటైన ఈ COCHLEAR IMPLANT సర్జర్ ని మా MICROCARE ENT HOSPITAL లో నిర్వహిండం గర్వాంగా వుందన్నారు.

సూడాన్ దేశానికి చెందిన ముగ్గురు ఒకే కుటుంబీకులైన అన్నదమ్ములకి వరుసగా మూడు రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరికి ఈ సర్జరీని చేయడం జరిగింది.. వారు MICROCARE ENT HOSPITAL కి వచ్చేముందు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విలువ ENT గురించి వారికీ అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా తెలుసుకొని చివరికి MICROCARE ENT HOSPITAL లే వారి చిన్నారుల వినికిడి సమస్యని తీర్చగలదని నమ్మి, మా వద్దకి వచ్చారని, ఇది తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

పుట్టుకతోనే లోతైన వినికిడి లోపంతో IMPLANTATION సర్జరీ అవసరమయిన పిల్లలందరికీ వరం లాంటిది ఈ COCHLEAR సర్జరీ. పుట్టు మూగా, చెవిటీ సమస్యని సమూలంగా రూపమాపడం ఈ సర్జరీ ద్వారా సాధ్యమయిందన్నారు. ఈ SURGERIES యొక్క ప్రాముఖ్యతని ప్రజలంతా తెలుసుకొని, తగిన అవగాహన కలిగి ఉండాలని ఇందుకు ఈ క్రింది ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించి వారికి వినికిడి సమస్య ఉన్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉన్న ENT DOCTORS చూపించి, వారి సూచనల మేరకు తగు జాగ్రతలు పాటిస్తూ.. ఈ పనికిడి మూగా సమస్యలని సమూలంగా మన సమాజం నుండి పారద్రోలవచ్చన్నారు.

MICROCARE ENT HOSPITAL. సిబ్బంది ఇటువంటి అరుదైన సర్జరీస్ చేయడానికి తగిన నైపుణ్యంతో అందుకు కావలసిన ప్రపంచ స్థాయి ఆధునిక వైద్య సదుపాయాల సామగ్రితో సిద్ధంగా ఉన్నామని తెలిసారు. COCHLEAR IMPLANTATION లోని పై పరికరాలన్నీ CHARGE పెట్టుకోవడం కష్టంగా ఉండేది. అయితే నేడు మనకు అందుబాటులోకి వచ్చిన వైద్య టెక్నాలజీతో ఇప్పుడు COMPLETE గా. MAINTENANCE FREE IMPLANTATION సాధ్యమవుతోందన్నారు. ఈ చికిత్సలు విజయవంతం చేసేందుకు సహకరించిన వారికి తమ హాస్పిటల్ తరుపున డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో విన్నకోట శ్రీప్రకాష్ తో పాటు చిన్ని శ్రీ, ఆడియాలజిస్ట్ వేణుగోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.