Site icon NTV Telugu

Paracetamol Side Effects: వర్షాకాలంలో పారాసిటమాల్‌కు మంచి గిరాకీ.. దీని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా..?

Paracetamol

Paracetamol

Paracetamol Side Effects: వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో జబ్బులు బాగా పెరుగుతాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు అధికమవుతాయి. అయితే.. ఈ సీజన్‌లో పారాసిటమాల్ ట్యాబ్లెట్‌కు మంచి గిరాకీ ఉంటుంది. మనకు ఏ చిన్న జ్వరం వచ్చినా, తలనొప్పి లాంటిది ఉన్నపుడు వెంటనే పారాసిటమాల్‌ టాబ్లెట్ ఒకటి వేసుకుంటాం. ఒంట్లో వేడి పెరిగినపుడు, తలనొప్పి, పంటి నొప్పి, బెణుకులు, జలుబు, ఫ్లూ లాంటివి ఇబ్బంది పెడుతున్నపుడు వీటి నుంచి సత్వర ఉపశమనం కోసం ఏకైక పరిష్కారంగా పారాసిటమాల్‌ నే ఎంచుకుంటాం. ఈ ఒక్క ఔషధం అనేక రకాల సమస్యలను అదుపు చేస్తుంది. పారాసిటమాల్‌ను ఎసిటమైనోఫెన్ అని కూడా పిలుస్తారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దీని వినియోగం మరింత పెరిగింది. అయితే.. వీటిని ఎక్కువగా వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Telangana: తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పారాసిటమాల్‌ వాడకంతో జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావమయ్యే ముప్పు 24%, పేగుల్లో రక్తస్రావమయ్యే ముప్పు 36% పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే కిడ్నీజబ్బు (19%), గుండె వైఫల్యం (9%), అధిక రక్తపోటు (7%) వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. పారాసిటమాల్‌ నొప్పిని అంతగా తగ్గించదు కాబట్టి వృద్ధుల్లో కీళ్లనొప్పుల వంటి వాటికి దీన్ని దీర్ఘకాలం వాడటంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. అందుకే ప్రతి చిన్న కారణాలకు ఇలా ట్యాబ్‌లెట్‌పై ఆధారపడకుండా న్యాచురల్ రెమిడీస్ ను ఎంపిక చేసుకోండి. ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు అడిగితే.. జలుబు, దగ్గు, స్వల్ప జ్వరం వంటి వాటికి ఏదో ఒక చిట్కా చెబుతారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version