Diabetes: డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ఇది పెరుగుతున్న సమస్య. 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నట్లు అంచనా. అయితే.. షుగర్ వల్ల శృంగార సామర్థ్యం తగ్గుతుందా..? అనే అంశంపై తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
READ MORE: MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట..
మగవారిలో శృంగార సామర్థ్యం క్షీణించటానికి వయసు, టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గటం మాత్రమే కాదు.. రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరగటమూ కారణమవుతున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంది. మధుమేహంగా గుర్తించే స్థాయిలో గ్లూకోజు పెరగాల్సిన అవసరమేమీ లేదట. ఒకింత ఎక్కువగా పెరిగినా కూడా శుక్ర కణాల వేగం నెమ్మదించటానికి, అంగ స్తంభన బలహీనం కావటానికి, శృంగారాసక్తి తగ్గటానికి దారితీస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. మగవారు తమ శృంగార, సంతాన సామర్థ్యాన్ని కాపాడుకోవటానికి కేవలం టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదులే కాకుండా రక్తంలో గ్లూకోజును నియంత్రించుకోవాలని ఇది తెలిపింది.
READ MORE: Driver Murder Case: డెడ్‌బాడీ డోర్‌డెలివరీ కేసు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు కీలక ఆదేశాలు..
