Site icon NTV Telugu

Pregnancy Health Tips: గర్భంతో ఉన్నప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ వాడుతున్నారా..?

Parasetmol

Parasetmol

Pregnancy Health Tips: గర్భాధారణ సమయంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్లు ఉపయోగించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వీటి ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉండే అవకాశం ఉందని గుర్తించారు. కాబట్టి, ఈ సమయంలో తల్లి ఆరోగ్యమే కాకుండా గర్భంలోని శిశువు ఆరోగ్యం ఉండటం కూడా అత్యంత ముఖ్యమైంది. ప్రతి చిన్న చిన్న జ్వరాలు, తలనొప్పులు, ఒళ్లునొప్పులు లాంటి సమస్యల కోసం చాలా మంది ఈ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. కానీ, గర్భధారణ సమయంలో వీటి వాడకంపై వైద్య నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడకంలో సూచనలు..
గర్భధారణలో సమయంలో అప్పుడప్పుడు జ్వరం, ఒళ్లునొప్పులు వంటివి వచ్చినప్పుడు పారాసెటమాల్ ట్యాబ్లెట్లను అధిక మోతాదులో లేదా తరచుగా ఉపయోగించడం వల్ల గర్భంలోని శిశువుపై ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా శిశువు మెదడు అభివృద్ధి, ప్రవర్తనాలో సమస్యలు లాంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.

డాక్టర్ సలహా తప్పనిసరి
అయితే, పారాసెటమాల్ ట్యాబ్లెట్ సాధారణంగా సురక్షితం.. కానీ, గర్భధారణ సమయంలో ఏ మందు ఉపయోగించాలని అనేదానిపై ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. జ్వరం ఎక్కువైనప్పుడు లేదా ఒళ్ల నొప్పులు బాగా ఉన్నప్పుడు మాత్రమే వైద్యుల సూచనలతో తక్కువ మోతాదులో మాత్రమే దీన్ని తీసుకోవాలి.

సహజ పద్ధతులను అనుసరించాలి
గర్భంతో ఉన్నప్పుడు తలనొప్పి, బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు వెంటనే మందులపై ఆధారపడకుండా రెస్టు తీసుకోవడం, గోరువెచ్చని నీళ్లు త్రాగడం, వ్యాయామం చేయడం లాంటి సహజ పద్ధతులను అనుసరించడం బెటర్.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version