Site icon NTV Telugu

Eggs In Summer: వేసవిలో గుడ్లు తింటున్నారా? డాక్టర్ల హెచ్చరిక

Eting Eggs

Eting Eggs

Eggs In Summer: వేసవిలో గుడ్లు తక్కువగా తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినవచ్చని వారు అంటున్నారు. అంతకు మించి తింటే కొన్ని రకాల రోగాలు తప్పవని అంటున్నారు. గుడ్లు ఎక్కువగా తింటే.. ముఖ్యంగా ఉడికించి లేదా వేయించి తింటే శరీరంలో సోడియం శాతం పెరుగుతుంది. శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ సమస్య వస్తుందని చెబుతున్నారు. గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు మనల్ని వెచ్చగా ఉంచుతాయి. గుడ్లు జీర్ణక్రియ సమయంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. వేసవిలో గుడ్లు ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగి వేడి వాతావరణంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు (డమేరియా) వంటి సమస్యలు వస్తాయి.

Read also: Ambedkar statue: నేడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం.. ముఖ్యఅతిథిగా మునిమనవడు

ముఖ్యంగా వండిన కోడిగుడ్లను నిల్వ ఉంచుకుని తింటే… వాటి వల్ల మార్పు వస్తుంది. గుడ్లలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. గుడ్లు ఎక్కువగా తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. గుడ్లు బాగా ఉడికించాలి లేదా బాగా వేయించాలి.. పచ్చి గుడ్లు తినకూడదు. వాటిలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండటం వల్ల ఇది గుడ్డును విషపూరితం చేస్తుంది. వేసవిలో ఈ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. అందుకే వేసవిలో గుడ్లు తక్కువగా తీసుకోవడం మంచిది. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి గుడ్లు మితంగా తినాలి. అవి పూర్తిగా ఉడికినట్లు నిర్ధారించుకోండి. ఆరోగ్యం కోసం మీ ఆహారంలో గుడ్లు కాకుండా ఇతర ఆహారాలను కూడా చేర్చుకోవాలి. అన్ని రకాల పోషకాలను అందించాలి.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version