NTV Telugu Site icon

Cancers In India: భారత్‌లో పెరుగుతున్న “హెడ్ అండ్ నెక్” క్యాన్సర్లు.. 26 శాతం కేసులు..

Cancer Cases In India

Cancer Cases In India

Cancers In India: భారతదేశంలో క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్లలో ‘‘హెడ్ అండ్ నెక్’’ క్యాన్సర్లే 26 శాతం ఉన్నాయని, దేశంలో తల మరియు మెడ క్యాన్సర్లు పెరుగుతున్నాయని ఓ అధ్యయనం తెలియజేసింది. శనివారం ప్రపంచ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1869 మంది క్యాన్సర్ రోగులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఢిల్లీకి చెందిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మార్చి 1 నుంచి జూన్ 30 వరకు తన హెల్ప్‌లైన్ నంబర్‌కు వచ్చిన కాల్స్ డేటాను సేకరించి ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

భారతదేశంలో ‘‘క్యాన్సర్ ముక్త్ భారత్’’ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. భారత్‌తో పెరిగిన పొగాకు వినియోగం, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) ఇన్‌ఫెక్షన్ కారణంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువకుత్లో కాన్సర్లు రావడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. సుమారు 80-90 శాతం నోటి క్యాన్సర్ రోగులు పొగాకును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తున్నారు, అది ధూమపానం లేదా నమలడం కావచ్చని చెప్పారు. మిగతా క్యాన్సర్లలా కాకుండా ఈ తరహా క్యాన్సర్లను నివారించవచ్చని, మన జీవనశైలిలో మార్పుతో ఈ క్యాన్సర్లకు చెక్ పెట్టొచ్చని చెప్పారు.

Read Also: Boyfriend Kills Woman: 20 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన బాయ్‌ఫ్రెండ్..

పొగాకును మానేయడం ద్వారా ఈ వ్యాధిని అడ్డుకోవచ్చని నిపుణులు చెప్పారు. భారతదేశంలో దాదాపుగా మూడింట రెండు వంతుల క్యాన్సర్ కేసులను స్క్రీనింగ్ తక్కువగా ఉండటంతో ఆలస్యంగా గుర్తింస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఫస్ట్ లేదా సెకండ్ స్టేజ్‌లో క్యాన్సర్‌‌ని గుర్తిస్తే 80 శాతం కన్నా ఎక్కువ మందిలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు నయమవుతాయని, క్యాన్సర్లకు ప్రతీ వారం కొత్త ఔషధాలు వస్తూనే ఉంటాయని, ఇది మెరుగైన ఫలితాలకు, మెరుగైన చికిత్సకు సాయపడుతాయని చెప్పారు.

శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మరియు ఇమ్యునోథెరపీల కలయికను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు. తాజాగా క్యాన్సర్ చికిత్స కేవలం వ్యాధి నుంచి బయటపడటమే కాకుండా, జీవణ ప్రమాణాన్ని అందించడానికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని ఆశిష్ గుప్తా చెప్పారు. ఈ క్యాన్సర్ల తర్వాత తర్వాతి ప్లేస్‌లో ‘జీర్ణాశయ క్యాన్సర్లు’ 16 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. రొమ్ము, రక్త క్యాన్సర్లు 9 శాతం ఉన్నాయి. ఇటీవలి గ్లోబోకాన్ నివేదిక ప్రకారం, 2040 నాటికి భారతదేశంలో 2.1 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది, ఇది 2020లో సంఖ్య కంటే పెద్ద పెరుగుదల.