Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!

Kitchen Tips

Kitchen Tips

Kitchen Tips: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. గృహిణులకు వంటగదిలోనే సగం జీవితం గడిచిపోతుంది. అయితే ఎంత కష్టపడినా కొన్నిసార్లు వంటలు కుదరవు, మరికొన్నిసార్లు వంటింటి సమస్యలు విసుగు తెప్పిస్తుంటాయి. కానీ స్మార్ట్‌గా ఆలోచిస్తే ఎంతటి పెద్ద సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చు. కాకరకాయ చేదు వదిలించడం దగ్గరి నుంచి.. బిర్యానీని హోటల్ స్టైల్‌లో పొడిపొడిగా వండడం వరకు, మీ కిచెన్ పనులను ఈజీగా మార్చేసే 10 అదిరిపోయే వంటింటి చిట్కాలు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

కిచెన్ పనులను ఈజీగా మార్చేసే 10 అదిరిపోయే వంటింటి చిట్కాలు

×
×
Ad

* బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా వేపాకు – మిరియాలను లైట్‌గా ఫ్రై (వేడి) చేసి బియ్యంలో కలపాలి.

* ఇంట్లోకి నల్లులు రాకుండా ఉండాలంటే.. ఎండిపోయిన వేపాకులు, కర్పూరం కలిపి పొడిలా చేసి, ఇంటి మూలల్లో చల్లాలి.

* టమాటాలను ఎక్కువ రోజులు తాజాగా స్టోర్ చేయాలనుకుంటే వాటిని ఫ్రిడ్జ్‌లో కాకుండా రూమ్ టెంపరేచర్ (గది ఉష్ణోగ్రత) వద్ద ఉంచడం మంచిది.

* చింతపండును సాధారణ నీళ్లకు బదులుగా వేడి నీళ్లలో నానబెడితే, దాని నుంచి రసం చాలా సులభంగా వస్తుంది.

* కాకరకాయ వండేటప్పుడు చేదు తగ్గాలంటే, మొదట దానిపై ఉండే చెక్కును తీసేసి, కొద్దిగా ఉప్పు (సాల్ట్) వేసి రుద్దాలి.

* కొబ్బరి పాలు పిండేటప్పుడు జల్లెడకు బదులుగా ఒక పలుచటి గుడ్డను (క్లాత్) ఉపయోగిస్తే పాలు మరింత చిక్కగా వస్తాయి.

* ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన పన్నీర్ గట్టిగా ఉంటుంది. దానిని కొంచెం సేపు గోరువెచ్చని నీళ్లలో ఉంచితే ఎంతో సాఫ్ట్‌గా మారి, సులభంగా కట్ చేసుకోవడానికి వీలవుతుంది.

* బిర్యానీ చేసేటప్పుడు అన్నం ఒకదానికొకటి అంటుకోకుండా పొడిపొడిగా రావాలంటే, బియ్యం ఉడికేటప్పుడు (బాయిల్ అయ్యే సమయంలో) కొద్దిగా రోజ్ వాటర్ వేయాలి.

* అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఒకే పెద్ద డబ్బాలో కాకుండా, చిన్న చిన్న బాక్సుల్లో స్టోర్ చేసుకుంటే దాని ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది.

* పాస్తాను ఉడికించేటప్పుడు నీళ్లలో కొంచెం సాల్ట్ వేస్తే పాస్తా ముక్కలకు ఉప్పు పట్టి, టేస్ట్ చాలా బాగుంటుంది.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వంటింటి పనులను మరింత సులభంగా, స్మార్ట్‌గా ముగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.