అధిక చెమటను ఈ చిట్కాలతో నివారించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండాకాలం వచ్చేసింది. ఈసారి ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండాకాలంలో కొంతమందికి చెమట ఎక్కువగా పట్టి చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. అలాగే చాలా అసౌకర్యంగా అన్పిస్తుంది కూడా. అయితే ఈ సమస్యను నివారించడానికి అనేక సింపుల్ గా ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ ఇంటి చిట్కాలు అధిక చెమటను నిరోధించడానికి బాగా పని చేస్తాయి. ప్రతిరోజూ ఇంట్లో తయారు చేసిన ఒక గ్లాసు తాజా టమాట జ్యూస్ తాగండి. ఇది చెమటను తగ్గిస్తుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ కూడా తాగొచ్చు. ఈ జ్యూస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది చెమటను తగ్గిస్తుంది. అంతేకాదు వీట్ గ్రాస్ జ్యూస్ లో విటమిన్ బి 6, ప్రోటీన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 బాగా లభిస్తాయి. చెమటను తగ్గించే ఇంకో సులభమైన చిట్కా కార్న్ ఫ్లార్, బేకింగ్ సోడా కాంబినేషన్. 1/2 కప్పు కార్న్‌స్టార్చ్, 1/2 కప్పు బేకింగ్ సోడా, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని అండర్ అర్మ్స్ కు పట్టించండి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా ఎండాకాలంలో వదులుగా ఉండే సౌకర్యవంతమైన బట్టలు చెమటను నివారించడంలో సహాయపడతాయి. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అందుకే కాఫీ, టీలు కొంచం తక్కువగా తాగండి. ఇంకా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఆల్కహాల్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు, కారంగా ఉండే వంటకాలు ఎక్కువగా తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పడుతుంది.
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
- Tags
- Excessive Sweat
- Summer
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!