NTV Telugu Site icon

Health Tips: వర్షాకాలంలో చేపలు ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?

Seafood

Seafood

నాన్ వెజ్ ప్రియులు చికెన్ తో పాటు చేపలను కూడా తింటారు.. నిజం చెప్పాలంటే చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటారు.. అయితే వర్షాకాలంలో చేపలను తినొచ్చా లేదా అనే సందేహాలు ఉంటాయి..సాధారణంగా రుతుపవనాలు.. ఉపశమనం, తాజాదనాన్ని కల్పిస్తాయి. అయితే, అదే సమయంలో నీటి వనరులలో కలుషిత ప్రమాదం మరింత పెరుగుతంది. తద్వారా సముద్రపు ఆహారం ఆరోగ్యానికి హానీ చేసే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలంలో సీఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.. అసలు వర్షాకాలంలో ఎందుకు చేపలను తినకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

*. వర్షాలు, వరదల కారణంగా నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. వర్షపు నీరు, భూమి నుంచి నదులు, సరస్సుల ద్వారా సముద్రాలలోకి చేరుతాయి. తద్వారా కాలుష్యం కూడా సముద్రంలో ఎక్కువ అవుతుంది. చేపతలు, ఇతర జలచరాలు ఈ కాలుష్య కారకాలను ఆహారంగా తీసుకుంటాయి. అవికాస్తా వాటి శరీరంలో పేరుకుపోతాయి. ఫలితంగా ఈ సీజన్‌లో చేపలు తినడం వలన చేపలు, సీఫుడ్స్‌లోని కాలుష్య కారకాలు మన శరీరంలోకి కూడా ప్రవేశిస్తాయి. దాంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..

*. ఇకపోతే మెర్క్యూరీ ఒక విషపూరితమైన హెవీ మెటల్. ఇది చేపలు, ఇతర సముద్రపు ఆహారంలో ఉంటుంది. ముఖ్యంగా ట్యూనా, స్వోర్డ్ ఫిష్, షార్క్ వంటి చేపల కణజాలాలలో పేరుకుపోతుంది. రుతుపవనాల కారణంగా పాదరసం స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవతాయి. చేపల రకం, పరిమాణం అంశంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. కలుషితమైన చేపలు తినడం వలన కాలక్రమేణా మన శరీరంలో పాదరసం ప్రమాదకరమైన స్థాయికి చేరుతుంది.. దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని చెబుతున్నారు..

*.అంటువ్యాదులు.. వర్షాకాలం నీటి వనరులలో పరాన్నజీవుల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. చేపలు, సముద్రపు ఆహారంలో టేప్‌వార్మ్‌లు, రౌండ్‌వార్మ్‌లు, ఫ్లూక్స్ వంటి పరాన్నజీవులు ఉండవచ్చు. ఇవి మనం తిన్నప్పుడు ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయి. ఈ అంటువ్యాధులు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కలుషితమైన సీఫుడ్స్ తినడం వలన అతిసారం, ఉబ్బరం, గ్యాస్ ఏర్పడుతుంది.. అందుకే దూరంగా ఉండాలి..

*. కొందరికి చేపలు, ఇతర సీఫుడ్స్ వలన అలెర్జీ ఏర్పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో ఈ అలెర్జీలు మరింత తీవ్రమవుతాయి. రోగనిరోధక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. సీఫుడ్స్ అలెర్జీ సమస్యలు తేలికపాటి నుండి తీవ్రమైనవి కూడా ఉండే అవకాశం ఉంది. దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. దద్దుర్లు, ముఖం, పెదవులు, నాలుక, గొంతు వాపు, గురక, శ్వాస సంబంధిత వ్యాదులు వస్తాయి..ఇన్ని సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. మరి తినడం కన్నా దూరంగా ఉండటం బెస్ట్ కదా..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.