ఈరోజుల్లో ఎక్కువ మంది డైట్ ను ఫాలో అవుతుంటారు.. అందుకే బ్రౌన్ బ్రెడ్ ను డైట్ లో చేర్చుకుంటున్నారు.. చాలా మంది బ్రౌన్ బ్రెడ్‌ని ఉదయం లేదా రాత్రి భోజనంలా తీసుకుంటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ఎక్కువగా ఈ బ్రౌన్ బ్రెడ్ తింటారు. అలాగే టిఫిన్ చేయడానికి సమయం లేని వారు బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసుకుని లేదా ఉప్మా లాగా లేదా ఇతర రూపాల్లో తీసుకుంటారు.. ఎలా? ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రౌన్ బ్రెడ్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి.. ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, పోటాషియం, కార్బోహైడ్రేట్స్, సోడియం, కేలరీస్ వంటివి ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు.. ఈ బ్రెడ్ ను తినాలి అనుకునే వారు పోషకాలు ఉన్న ఆహారాలతో కలిపి తీసుకోవాలి. గుడ్డు, కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్, మిల్క్, నట్స్ బటర్ వంటి వాటితో తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..
ఈ బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల ఒత్తిడి సమస్య తగ్గుతుంది. బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీని వల్ల సంతోషంగా అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, మానసిక భయం ఉన్నవాళ్లు బ్రౌన్ తింటే బెటర్.. ఇక మల్టీ గ్రైన్ బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవడం వల్ల అన్ని పోషకాలు అందుతాయి.. గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది..
బరువు తగ్గాలని అనుకొనేవారు ఈ బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకోవడం మంచిది.. జీర్ణ సమస్యలు రావని చెబుతున్నారు.. ఇంకా ఎన్నో సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.