సాధారణంగా ఈ సృష్టిలో దొరికే ప్రతి ఒక్క పండు మన ఆరోగ్యానికి ఏదో విధంగా మేలు చేస్తాయి. రోజు పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యంతో పాటు ఉత్సాహాంగా ఉంటారు. అయితే ఈ చలికాలంలో చెర్లీ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడంతో ఎన్నో హెల్త్ బెనిపిట్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Read Also:Gang Rape: యువకుడిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన నలుగురు మహిళలు
ఆరోగ్యవంతమైన జీవనం కోసం పండ్లు తినడం చాలా మంచిదని డాక్టర్.. న్యూట్రిషియన్స్ చెబుతుంటారు. చెర్రీ పండ్లను తినడంతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. చెర్రీ పండ్లు తినేందుకు పుల్ల పుల్లగా, తియ్యగా ఉంటాయి. వీటిలో ఫైబర్, సీ విటమిన్, పోటాయం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయని.. రోజు ఒక కప్పు చెర్రీ పండ్లను తీసుకోవడంతో రోగ నిరోధక శక్తి పెరిగి.. ఉత్సాహంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Read Also:Health Benefits of Guava: జామ పండ్లు తినడంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే..
అయితే ఆర్థరైటిస్, గౌట్ సమస్యలతో బాధపడే వారు ఈ చెర్రీ పళ్లను తినడం వలన కీళ్ల నొప్పులు, వాపులు నుంచి ఉపశమనం కలుగుతుందని డాక్టర్లు తెలిపారు. పోషకాహార లోపం సమస్య దూరమవుతుందంటున్నారు. రాత్రి పూట నిద్రలో కాళ్లు తిమ్మిర్లు వచ్చి పట్టుకుపోయే సమస్య ఉన్నవారు ఈ పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ చెర్రీ పండ్లు గుండెపోటు సమస్యలకు తగ్గిస్తుందని.. అలాగే శరీరంలో అధికంగా ఉండే సోడియం బయటకు వెళ్లిపోతుందని వెల్లడించారు. చెర్రీ పండ్లు రెగ్యులర్ గా తీసుకోవడంతో… కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని..నిద్రను ప్రేరేపించే హార్మోన్ ఉత్పత్తి అవుతాయని వివరించారు. . దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని నిద్రలేమి సమస్య తగ్గుతుందని నిపుణులు సూచించారు.
