Site icon NTV Telugu

Ragi Soup Recipe: బరువు తగ్గించే, 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ రాగి సూప్ రెసిపీ.. రాత్రి లైట్ మీల్‌కు బెస్ట్!

Ragi Soup Recipe

Ragi Soup Recipe

Ragi Soup Recipe: దక్షిణ భారతదేశంలో రాగులు ఎక్కువగా తింటుంటారు. రాగుల్లో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. మిగతా చిరు ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులతో చేసిన పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. రాగి రొట్టె , జావా, సంకటి ఇలాంటి రెసిపీలకు కొంచెం సమయం ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే మనం ఇప్పుడు ఈజీగా పది నిమిషాల్లో తయారయ్యే రాగి సూప్‌ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. రాగి సూప్ అనేది చాలా తేలికగా చేసుకునే, బరువు తగ్గాలనుకునే వారికి సరిపోయే, పోషకాలు నిండిన హెల్తీ వంటకంగా చెబుతారు. ఇందులో కూరగాయలు, మిరియాల పొడి, వెల్లుల్లి కలవడంతో రుచిగా ఉండటమే కాకుండా జలుబు, దగ్గు ఉన్నా వెంటనే తగ్గించి శరీరానికి బలాన్ని ఇస్తాయి. కొందరికి రాత్రి లైట్‌గా భోజనం చేయాలనుకుంటారు. అలాంటి వాళ్లు వేడి వేడిగా రాగి సూప్ చేసుకుని తాగితే కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.

READ MORE: Adarsha Kutumbam: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గురూజీ సినిమాపై క్రేజీ రూమర్!

రాగి సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక కప్పు మిక్స్‌డ్ వెజిటబుల్స్ సిద్ధం చేసుకోవాలి. క్యారెట్, బఠాణీ, కాలీఫ్లవర్, బీన్స్ వేసుకుంటే ఇందులో ఉండేలా చూసుకోవాలి. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో బిర్యాని ఆకు, నలిపిన వెల్లుల్లి వేయాలి. ఒక నిమిషం వేగిన తర్వాత కట్ చేసిన కూరగాయలు వేసి నెమ్మదిగా వేపాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. కూరగాయలు కొంచెం క్రంచీగా ఉండాలంటే 7–9 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. మెత్తగా కావాలంటే ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ ఉంచొచ్చు. అవి మరుగుతుండగానే.. ఇంకో బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకుని పావు కప్పు నీళ్లు వేసి ముద్దలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మరిగుతున్న సూప్‌లో నెమ్మదిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. తరువాత ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి మూడు నిమిషాలు మరిగించాలి. మధ్య మధ్యలో కలిపితే సూప్ ముద్దలు కాకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. చివరగా స్టౌ ఆఫ్ చేసి బిరియాని ఆకును తీసేయాలి. వేడి వేడి గా సర్వ్ చేస్తే రుచికరమైన, కడుపు నిండే, బరువు తగ్గడానికి ఉపయోగపడే రాగి వెజిటబుల్ సూప్ రెడీ అవుతుంది. ఇది స్టార్టర్‌గా కూడా తీసుకోవచ్చు, లైట్ మీల్‌గానూ తాగొచ్చు.

Exit mobile version