Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్‌మేడ్ సీరమ్ ట్రై చేయండి!

Skincare

Skincare

Homemade Skincare: 45 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల నవయువతిలా మెరిసిపోవాలనే ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఈనాటి బిజీ లైఫ్‌స్టైల్, సరైన పౌష్టికాహారం లేకపోవడం, ఎడతెగని మానసిక ఒత్తిడి, కాలుష్యం వల్ల వయసు పెరగకముందే ముఖం మీద ముడతలు, సాగిపోయిన చర్మం, ముసలితనం ఛాయలు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. దీనికోసం వేలకు వేలు ఖర్చు పెట్టి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాడడం, లేదా బొటాక్స్ లాంటి ఖరీదైన ట్రీట్‌మెంట్లు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. మన వంటింట్లో సులభంగా దొరికే చిన్న ఫ్లాక్స్ సీడ్స్, అంటే అవిసె గింజలతోనే ముఖానికి సహజమైన మెరుపును, బిగుతును తెచ్చే అద్భుతమైన హోమ్‌మేడ్ కొల్లాజెన్ సీరమ్‌ తయారు చేసుకోవచ్చు.

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మానికి అవసరమైన సహజమైన కొల్లాజెన్‌ను పెంచడంలో గ్రేట్‌గా పనిచేస్తాయి. ఈ అవిసె గింజల జెల్‌‌కు ఒక చెంచా కలబంద (ఎలోవెరా) జెల్, విటమిన్ E క్యాప్సూల్ ఆయిల్, ఇంకా బాదం నూనె కలిపి ముఖానికి రాసుకుంటే అది ఒక మ్యాజికల్ కొల్లాజెన్ సీరమ్‌లా పనిచేస్తుంది. ఇది వదులైన చర్మాన్ని టైట్ చేసి, ముడతలను మాయం చేయడానికి అద్భుతంగా సాయపడుతుంది. దీన్ని వారానికి మూడు సార్లు క్రమం తప్పకుండా వాడితే చాలు, 45 ఏళ్లలోనూ మీ చర్మం 25 ఏళ్ల నాటి కాంతిని, బిగుతును సంతరించుకుంటుంది.

తయారీ విధానం కూడా చాలా తేలిక. ఒక పాత్రలో ఒక కప్పు నీళ్లు, రెండు స్పూన్ల అవిసె గింజలు వేసి మీడియం మంట మీద ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి. నీళ్లలో తెల్లటి నురుగు వచ్చి, అది జిగటగా జెల్‌లా మారగానే స్టవ్ ఆపేయాలి. జెల్ చల్లబడితే బాగా గట్టిపడిపోతుంది కాబట్టి, వేడిగా ఉన్నప్పుడే కాటన్ గుడ్డ లేదా జల్లెడ సాయంతో ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ అవిసె గింజల జెల్‌లో ఒక స్పూన్ కలబంద జెల్, బాదం నూనె, విటమిన్ E క్యాప్సూల్ ఆయిల్ వేసి మిశ్రమం బాగా కలపాలి.

వాడే పద్ధతి కొస్తే, ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని తుడుచుకోవాలి. ఆ తర్వాత ఈ కొల్లాజెన్ సీరమ్‌ను ముఖం, మెడ భాగంలో కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలి. చర్మం బాగా లాగినట్లు, బిగుతుగా అయ్యేంత వరకు అంటే ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై మామూలు నీళ్లతో ముఖాన్ని కడిగేసి, మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారంలో మూడు సార్లు ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు, ముడతలన్నీ తగ్గి చర్మం ఎంతో మెరుస్తూ, టైట్‌గా తయారువుతుంది.