Site icon NTV Telugu

Dry Coconut : ఎండు కొబ్బరిని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Dry Coconuts

Dry Coconuts

కొబ్బరి నీళ్లు రోజూ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అందుకే రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నాయి.. కొబ్బరినీళ్లు మాత్రమే కాదు ఎండు కొబ్బరిని రోజూ తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

ఎండు కొబ్బరిని ఎక్కువగా మసాలా వంటల్లో వాడుతారు.. అంతేకాదు ఎండు కొబ్బరిలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్‌, సెలీనియం ఉంటాయి.. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది..

చర్మ సమస్యలు తగ్గుతాయి. ఎండు కొబ్బరిని తింటే క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. బోలు ఎముకల వ్యాధి నుంచి బయట పడవచ్చు.. అలాగే ఒత్తిడి వంటివి తగ్గుతాయి.. అలసట తగ్గుతుంది. బరువు తగ్గాలని అనుకొనేవారు రోజూ చిన్న ముక్కను తీసుకోవచ్చు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.. ఎండు కొబ్బరిలో సమృద్ధిగా ఉండే ఐరన్ రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది..జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.. ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version