NTV Telugu Site icon

suffering pimples: మొటిమల బాధ తగ్గాలంటే ఇలా చేయండి

Pimples10

Pimples10

యువతరాన్ని అధికంగా వేధిస్తున్న సమస్యల్లో చర్మ సమస్య ఇకటి. అందులో ముఖ్యంగా మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. యుక్త వయసులో మొటిమలు రావడం సహజం. హార్మోన్ల మార్పులు తదితరాల కారణాల వల్ల ముఖం, ఛాతి, వీపు భుజాలపై మొటిమలు వస్తుంటాయి. ముఖంపై మొటిమలను తొలగించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.. యువత. కాని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాటిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

READ MORE: Happy Birthday Stick: కేక్ మీదకి ‘హ్యాపీ బర్త్ డే స్టిక్’ అడిగిన మహిళ.. చివరకు..

రోజుకు కనీసం రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో చర్మంపై ఏర్పడ్డ జిడ్డు తగ్గడంతో పాటు.. మృత కణాలు వదులుతాయి. ఎక్కువ సార్లు ముఖం కడుక్కుంటే కీడు సంభవించే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా మనం వాడే కఠిన మైన సబ్బులు చర్మాన్ని చికాకు పారుస్తాయి. మృదువైన సబ్బులతో పాటు మృదువైన టవల్ లను వినియోగించాలి. చేతులను నిత్యం ముఖానికి తాకించరాదు. ఎందుకంటే మన చేతికున్న బ్యాక్టీరియా ముఖంపైకి చేరుతుంది. మొటిమలతో అప్పటికే ఉబ్బి ఉన్న ముఖం మరింత చికాకు పెడుతుంది.మొటిమలను గిల్లడం చేయరాదు. బ్యాక్టీరియా లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. మొటిమలను తగ్గించుకోవడానికి మందుల దుకాణాల్లో దొరికే లేపనాలు వాడుకోవచ్చు. అందులో ఉండే బెంజైల్, పెరాక్సైడ్, శాలిసౌలిక్ యాసిట్ వంటివి ఉంటాయి. బ్యాక్టీరియాను నిర్మూలించడానికి తోడ్పడతాయి.

అమ్మాయిలు ముఖ్యంగా మేకప్ వేసుకునే టప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మొటిమలు ఉన్నప్పుడు ఫౌండేషన్. పౌడర్ అద్దుకోవద్దు. ఒక వేళ వేసుకుంటే రాత్రిపూట పూర్తిగా తుడిచేయాలి. తలమీద రాసే నూనే నుదురును తాకినప్పుడు మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అప్పటికే ఉన్న మొటిమలు మరింత ఎక్కువ కావచ్చు. తలస్నానం చేసే టప్పుడు తలకు నూనె రాసుకోవద్దు. ఇది ముఖం మీదకి వ్యాపించి, చర్మ రంధ్రాలను మూసేయొచ్చు. పొడవైన జుట్టు ముఖం మీదకు రాకుండా చూడాలి. ఎండ ముఖానికి తగలనీయొద్దు. ఎందుకంటే ఎండలో అతినీలలోహిత కిరణాలు చర్మంలో వాపు ప్రక్రియను, ఎరుపును ప్రేరేపిస్తాయి. తినే పదార్థాలను మార్చుకోవాల్సి ఉంటుంది. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. పాల ఉత్పత్తులు ఎక్కెర ఎక్కువగా ఉండే మిఠాయిలు వంటివి తినొద్దు. రోజూ తప్పినిసరిగా వ్యాయామం చేయాలి.