Site icon NTV Telugu

Dinner : రాత్రి పూట భోజనాన్ని ఎందుకు త్వరగా తినాలో తెలుసా?

Dinner

Dinner

మనం ఆరోగ్యంగా ఉండాలంటే టైం కు తినాలి, టైం కు పండాలని నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.. అప్పుడే శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు అందుతాయి.. మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. టైం కు తినకపోతే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. అయితే రాత్రి సమయంలో ముఖ్యంగా ఆహారాన్ని త్వరగా తీసుకోమని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు.. అదే చాలా లేటుగా భోజనం తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం అవ్వదు. దానివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.. లేటుగా భోజనం చెయ్యడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

త్వరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాలరీలు త్వరగా కరుగుతాయి. దాంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది మరియు గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. భోజనం త్వరగా తినేయడం వల్ల శరీరంలో మెటబాలిజం మెరుగ్గా ఉంటుంది..బరువు కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇలా త్వరగా భోజనం చేయడం వల్ల రాత్రి నుండి ఉదయం వరకు ఏమి తినరు అంటే దానివల్ల శరీరంలో ఇన్సులిన్ బ్యాలెన్స్ గా ఉంటుంది.. షుగర్ వంటి దీర్ఘ కాలిక రోగాలు రాకుండా ఉంటాయి..

ఇకపోతే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి 7 గంటలు లోపు ఆహారాన్ని తీసుకుంటే మేలు. రాత్రి సమయంలో త్వరగా ఆహారం తీసుకుంటే ఉదయం లేవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతో ఉదయం త్వరగా లేవగలుగుతారు. రాత్రి సమయంలో భోజనాన్ని త్వరగా తినడం వల్ల ఆహారం జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువగా ఉంటుంది.. ఉదయం లేవగానే పొట్ట ఎంతో సులభంగా క్లియర్ అవుతుంది. పైగా రాత్రి సమయంలో ఆహారాన్ని హెవీ గా తీసుకోకూడదు. ముఖ్యంగా నూనె పదార్థాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మేలు అని గమనించాలి. అందుకే చాలా శాతం మంది రాత్రి భోజనంలో భాగంగా తక్కువ క్యాలరీలు ఉండేటువంటి పదార్థాలను తీసుకుంటారు.. నైట్ జంక్ ఫుడ్స్ ను నాన్ వెజ్ ను వీలైనంతవరకు అవైడ్ చెయ్యడం బెస్ట్..

Exit mobile version