NTV Telugu Site icon

Crystal Salt : కళ్లు ఉప్పు వాడుతున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

Crystal Salt

Crystal Salt

వంటల్లో సుగంధ ద్రవ్యాలను వాడినా, ఖరీదైన మసాలాలను వాడినా కూడా ఉప్పు, కారం సరిగ్గా సరిపోకుంటే మాత్రం రుచిగా ఉండదు.. ఉప్పును సరిపడా వేసుకుంటేనే ఆ వంటలు రుచిగా ఉంటాయి.. అయితే కొంతమంది సాల్ట్ ను వాడితే, మరికొందరు కళ్లు ఉప్పును ఎక్కువగా వాడుతారు.. అయితే కళ్లు ఉప్పును వాడే వారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఉప్పును ఎక్కువగా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ ఉప్పులో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగు పరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.. ఈ ఉప్పులో ఉండే పోటాషియం రక్త పోటును నియంత్రిస్తుంది.. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది.. అలాగే నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది.

ఈ ఎండాకాలంలో డీహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర స్పూన్ ఉప్పును కలిపి బాగా కరిగాక తాగితే మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత కలుగుతుంది. స్నానం చేసే నీటిలో ఈ ఉప్పును వేసి స్నానం చేస్తే చర్మంపై ఉన్న మురికి త్వరగా పోతుంది.. అలాగే షాంపులో కాస్త ఉప్పు వేసి తల స్నానం చేస్తే జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గిపోతాయి.. గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది… ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments