Site icon NTV Telugu

Chicken : చికెన్ లివర్ ను ఎక్కువగా తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..

Chicken Liverrr

Chicken Liverrr

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చికెన్ లో ఎన్ని రకాల వెరైటీలు ఉంటాయో అన్ని రకాలు చేసుకొని తింటారు.. అయితే కొంతమందికి చికెన్ లివర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది.. చికెన్ లివర్ ను తినడం వల్ల ఏదైన సమస్యలు వస్తున్నాయా అనేది చాలా మందికి సందేహాలు ఉంటాయి. అసలు ఆ లివర్ ను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్లు , మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫొలేట్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. అందుకే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు చికెన్ లివర్ ను తీసుకోవడం వల్ల రక్త, చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. అలాగే బి 12, విటమిన్ కే అధికంగా ఉంటాయి. దాంతో ఎముకల సమస్యలు పూర్తిగా తగ్గుతాయి..

మతి మరుపు, జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తుంది.. చికెన్ లివర్ డయాబెటిస్ పేషెంట్లకు కూడా మంచిది. దీన్ని తినడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే లివర్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.. గుండె సమస్యలను వెంటనే తగ్గిస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యలు దూరం అవుతాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version