Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం

  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు
  • మంచి స్టైపెండ్‌తో అవకాశం
  • మే 19, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు
Union Bank Recruitment 2026

Union Bank Recruitment 2026

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1865 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 303, తెలంగాణ లో164 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 29, 2026 నుంచి ప్రారంభమై, మే 19, 2026 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
విద్యా అర్హత

ఏదైనా విభాగంలో పట్టభద్రుడు (Graduate) అయి ఉండాలి.
డిగ్రీ ఫలితం 01 ఏప్రిల్ 2026 లేదా అంతకు ముందు విడుదలై ఉండాలి.

వయో పరిమితి (01.04.2026 నాటికి):

కనీసం: 20 సంవత్సరాలు
గరిష్టం: 28 సంవత్సరాలు
రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ:

ఆన్‌లైన్ రాత పరీక్ష
స్థానిక భాషా పరీక్ష (Local Language Test)
పత్రాల ధృవీకరణ
వైద్య పరీక్ష

స్టైపెండ్ (నెలవారీ):

గ్రామీణ / సెమీ-అర్బన్ ప్రాంతాలు : రూ.15,000
అర్బన్ ప్రాంతాలు : రూ.18,000
మెట్రో నగరాలు : రూ.20,000
ఈ అప్రెంటిస్‌షిప్ 1 సంవత్సరం కాలానికి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ / OBC (పురుషులు) : రూ.944
జనరల్ / OBC (మహిళలు) : రూ.708
SC / ST / PwBD / ట్రాన్స్‌జెండర్ : రూ.236