UGC NET Exam Schedule: యూజీసీ నెట్ (UGC NET) డిసెంబర్ 2026 పరీక్షల తేదీలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 87 సబ్జెక్టులకు గాను ఆరు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 14 నుంచి 18 వరకు వరుసగా ఐదు రోజులు, ఆ తర్వాత డిసెంబర్ 21న చివరి రోజు పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు విడతల్లో పరీక్షలు ఉంటాయి. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి.
తేదీల వారీగా పరీక్షల పూర్తి షెడ్యూల్:
డిసెంబర్ 14: మొదటి షిఫ్ట్‌లో హిస్టరీ, పాలి, ప్రాకృత్, కంపారిటివ్ లిటరేచర్. రెండో షిఫ్ట్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, పెర్షియన్, రష్యన్, బెంగాలీ, హోమ్ సైన్స్, మ్యూజిక్, పాపులేషన్ స్టడీస్.
డిసెంబర్ 15: మొదటి షిఫ్ట్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, మలయాళం, ఉర్దూ, క్రిమినాలజీ, పెర్ఫార్మింగ్ ఆర్ట్ (డాన్స్/డ్రామా/థియేటర్), ట్రైబల్ అండ్ రీజనల్ లాంగ్వేజ్/లిటరేచర్, ఫోక్ లిటరేచర్. రెండో షిఫ్ట్‌లో సైకాలజీ, మైథిలి, అరబిక్, మేనేజ్మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సంస్కృత్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్, ఆయుర్వేద బయాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్.
డిసెంబర్ 16: మొదటి షిఫ్ట్‌లో పొలిటికల్ సైన్స్, కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజియన్స్, జపనీస్, డోగ్రీ. రెండో షిఫ్ట్‌లో కామర్స్, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇండియన్ కల్చర్, బుద్ధిస్ట్, జైన, గాంధీయన్ అండ్ పీస్ స్టడీస్, రాజస్థానీ, లింగ్విస్టిక్స్.
డిసెంబర్ 17: మొదటి షిఫ్ట్‌లో ఇంగ్లీష్, చైనీస్, కొంకణి, స్పానిష్, కాశ్మీరీ. రెండో షిఫ్ట్‌లో విజువల్ ఆర్ట్, మ్యూజియాలజీ అండ్ కన్జర్వేషన్, పంజాబీ, తమిళ్, జాగ్రఫీ, మరాఠీ, లేబర్ వెల్ఫేర్/పర్సనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సంతాలీ.
డిసెంబర్ 18: మొదటి షిఫ్ట్‌లో హిందీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, మణిపురి, కన్నడ, జర్మన్, సింధీ, ఫ్రెంచ్ (ఫ్రెంచ్ వెర్షన్). రెండో షిఫ్ట్‌లో తెలుగు, లా, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎలక్ట్రానిక్ సైన్స్, ఉమెన్ స్టడీస్, ఫోరెన్సిక్ సైన్స్, నేపాలీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఫిలాసఫీ.
డిసెంబర్ 21: మొదటి షిఫ్ట్‌లో ఎకనామిక్స్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హిందూ స్టడీస్, ఆంత్రోపాలజీ, బోడో, గుజరాతీ, సంస్కృత్, పాలిటిక్స్ అండ్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ స్టడీస్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్. రెండో షిఫ్ట్‌లో అస్సామీ, సోషియాలజీ, యోగా, టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, అడల్ట్ ఎడ్యుకేషన్, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, ఆండ్రగాగి, నాన్-ఫార్మల్ ఎడ్యుకేషన్, ఆర్కియాలజీ, ఒరియా, సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, స్టాటిస్టిక్స్, ఫారెస్ట్రీ పరీక్షలు ఉండనున్నాయి.
అభ్యర్థులకు పరీక్ష కేంద్రం ఏ నగరంలో పడిందో తెలిపే ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్’లను పరీక్ష తేదీకి 21 రోజుల ముందే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు తమ సిటీ స్లిప్‌లతో పాటు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ https://ugcnet.nta.nic.in, https://ugcnet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

