Site icon NTV Telugu

SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 7547 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Job Vacancy

Job Vacancy

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెబుతుంది.. తాజాగా ఢిల్లీ పోలీస్‌ విభాగంలో 7547 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC). దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.. వచ్చే నెల 4 వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు..

అర్హతలు..

12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా, అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థి జూలై 2, 1998 నుండి జూలై 1, 2005 మధ్య జన్మించి ఉండాలి. వయస్సు కూడా పరిమితి ఉంటుంది..

ఎంపిక ప్రక్రియ..

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్యం మరియు ప్రామాణిక పరీక్ష మరియు వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. నియామక పరీక్ష నవంబర్ 14 నుండి డిసెంబర్ 5, 2023 వరకు నిర్వహించనున్నారు… అందులో గ్రేడ్ సాధించిన వారిని ఎంపిక చేస్తున్నారు..

జీతం..

ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయబడిన అభ్యర్థులకు పే లెవెల్ 3 కింద రూ. 21700 నుండి రూ. 69100 వరకు నెలవారీ వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ తో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువగానే పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం .. ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను బాగా చదువుకొని అప్లై చేసుకోవాలి..

Exit mobile version