బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక IBPS వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూలై 21, 2026తో ముగుస్తుంది. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం: జూలై 1, 2026
దరఖాస్తు చివరి తేదీ: జూలై 21, 2026
అర్హతలు
IBPS SO పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి సంబంధిత గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆయా పోస్టులకు సంబంధించిన ప్రత్యేక విద్యార్హతలు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఉండాలి.
వయోపరిమితి
కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
వయో సడలింపు
SC/ST: 5 సంవత్సరాలు
OBC: 3 సంవత్సరాలు
దివ్యాంగులు (PwBD): 10 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర కేటగిరీలకు కూడా వయో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు
SC/ST/PwBD అభ్యర్థులు: రూ.175
జనరల్/OBC/EWS అభ్యర్థులు: రూ.850
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష
ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ప్రధానంగా:
ఇంగ్లీష్ లాంగ్వేజ్
రీజనింగ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వంటి అంశాల నుంచి అడుగుతారు.
మొత్తం మార్కులు: 125
పరీక్ష సమయం: 80 నిమిషాలు
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఎంపిక అవుతారు.
మెయిన్స్ పరీక్ష
మెయిన్ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. అనంతరం సంబంధిత పోస్టులకు అనుగుణంగా ఇంటర్వ్యూ/తదుపరి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
జీతం
IBPS SO పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ సదుపాయాలు తదితర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

