ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. రైల్వే, రక్షణ, సీజిఎల్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు BSNL అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుల స్వీకరణ జూన్ 4, 2026 నుంచి ప్రారంభం కానుంది. జులై 03 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని భావిస్తున్న ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు BSNL JTO Recruitment 2026 మంచి అవకాశంగా చెప్పవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఖాళీల వివరాలు
సంస్థ: BSNL
పోస్టు పేరు: జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO)
మొత్తం ఖాళీలు: 100
అర్హతలు
జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి:
టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
రేడియో ఇంజినీరింగ్
కంప్యూటర్ ఇంజినీరింగ్
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్
లేదా
M.Sc (Electronics)
M.Sc (Computer Science)
వయోపరిమితి
కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
వయస్సును జూలై 3, 2026 నాటికి లెక్కిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో అర్హత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతారు.
జీతం
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,400 నుంచి రూ.40,500 వరకు వేతనం లభిస్తుంది.
దరఖాస్తు ఫీజు
జనరల్ / OBC / EWS అభ్యర్థులు:
రూ.2,000
SC / ST / PwBD అభ్యర్థులు:
రూ.1,000. రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష ఎప్పుడు?
BSNL JTO నియామకానికి సంబంధించిన CBT పరీక్ష ఆగస్టు 2026లో తాత్కాలికంగా నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
BSNL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
JTO Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ పూర్తి చేసి లాగిన్ అవ్వండి.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుము చెల్లించండి.
ఫారమ్‌ను సమర్పించి ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
