Site icon NTV Telugu

BPNL Jobs: పది పాసైన వారికి గుడ్ న్యూస్.. 3444 ప్రభుత్వ ఉద్యోగాలకు సిగ్నల్..

Bpnl Recruitment 2023

Bpnl Recruitment 2023

నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు పలు సంస్థ ల్లో ఉన్న ఖాళీలను గతంలో కన్నా ఎక్కువగానే పోస్టుల ను భర్తీ చెయ్యనున్నట్లు సమాచారం.. అందుకే వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను పూర్తి చెయ్యడానికి మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ద్వారా రాజస్థాన్‌లోని జైపూర్‌ లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో 3444 ఖాళీల ను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు జూలై 5 వ తేదీతో ముగియనుంది.. ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3444 ఖాళీలకు గాను వీటిలో 574 సర్వే ఇన్‌ఛార్జ్‌ పోస్టులు ఉండగా.. 2870 సర్వేయర్‌ పోస్టులు ఉన్నాయి..

అర్హతలు :

పది లేదా ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి.. లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.. ఇకపోతే సర్వే ఇన్‌ఛార్జ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్‌ ఫీజుగా రూ. 944 చెల్లించాలి.. సర్వేయర్‌ పోస్టులకు రూ. 826 అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది..

ఇంటర్వ్యూ :

ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను బట్టి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24 వేల వరకు జీతం ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూలై 5 చివరి తేదీగా నిర్ణయించారు..

ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే..https://www.bharatiyapashupalan.com/ సందర్శించండి.. ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వాళ్ళు ముందుగా నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..

Exit mobile version