Site icon NTV Telugu

Job Alert: పరీక్ష లేకుండా ఆధార్ సెంటర్లలో ఉద్యోగం! మార్చి 10లోపు అప్లై చేసుకోండి..!

Jobs

Jobs

దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలను సామాన్యులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో సిఎస్సీ (CSC) ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కీలక అడుగు వేసింది. 2026 సంవత్సరానికి గాను వివిధ జిల్లాల్లోని ఆధార్ సేవా కేంద్రాల్లో (ASK) ఖాళీగా ఉన్న సుమారు 252 ఆధార్ సూపర్వైజర్ , ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన ఒక ఏడాది కాల పరిమితితో జరుగుతాయి, అయితే అభ్యర్థి పనితీరు , అవసరాలను బట్టి ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఆధార్ సేవలపై ఆసక్తి ఉండి, స్థానికంగానే ఉపాధి పొందాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

CM Revanth Reddy: 20 ఏళ్ల నా రాజకీయ ప్రయాణంలో లంబాడాల పాత్ర అమూల్యం..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 12వ తరగతి (ఇంటర్) ఉత్తీర్ణులై ఉండాలి. ఒకవేళ పదో తరగతి పూర్తి చేసిన వారైతే, రెండేళ్ల ఐటీఐ (ITI) లేదా మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. విద్యార్హతతో పాటు అభ్యర్థులు యుఐడిఏఐ (UIDAI) ద్వారా గుర్తింపు పొందిన ఎన్‌ఎస్‌ఈఐటీ (NSEIT) సంస్థ నుండి ‘ఆధార్ ఆపరేటర్/సూపర్వైజర్’ సర్టిఫికేట్ కలిగి ఉండటం అత్యవసరం. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా స్థానిక భాషపై పట్టు, కంప్యూటర్ నిర్వహణపై ప్రాథమిక అవగాహన , కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత లభిస్తుంది.

ఎంపిక విధానం విషయానికి వస్తే, అభ్యర్థులు ఇప్పటికే ఆధార్ సర్టిఫికేషన్ పరీక్ష పాస్ అయి ఉండాలి కాబట్టి, మరో రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు చేసుకున్న వారి విద్యార్హతలు , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి ఆయా రాష్ట్రాల కనీస వేతన చట్టాల ప్రకారం వేతనం అందించబడుతుంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్ career.csccloud.in సందర్శించి మార్చి 10, 2026 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఇప్పటికే విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్లు (VLEs) గా పనిచేస్తున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులని సంస్థ స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే నమ్మవద్దని, ఇది పూర్తిగా పారదర్శకంగా జరిగే ప్రక్రియ అని అధికారులు హెచ్చరించారు.

IND vs PAK: అభిషేక్‌ బ్యాటింగ్‌పై పాకిస్థాన్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు.. హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్..!

Exit mobile version