Site icon NTV Telugu

వూహ‌న్ శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌: బ‌య‌పెడుతున్న మ‌రో కొత్త నియోకోవ్‌ వైర‌స్‌…

ఇటీవ‌లే ద‌క్షిణాఫ్రికా దేశంలో మ‌రోకొత్త నియోకోవ్ వైర‌స్ వెలుగుచూసింది. ఈ వైర‌స్‌పై చైనాకు చెందిన వూహాన్ యూనివ‌ర్శిటీ, ఇనిస్టిట్యూట్ ఆప్ బ‌యో ఫిజిక్స్ శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం చేశారు. నియోకోవ్ వైర‌స్ మొద‌ట ద‌క్షిణాఫ్రికాలోని గ‌బ్బిలాల్లో క‌నుగోన్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. అ వైర‌స్ కార‌ణంగా అధిక మ‌ర‌ణాలు సంభ‌విస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. కొత్త వైర‌స్ సంక్ర‌మ‌ణ రేటు కూడా అధికంగానే ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ వైర‌స్ సోకిన ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు మ‌ర‌ణిస్తార‌ని స్పుత్నిక్ వూహాన్ శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. దీంతో ఈ కొత్త వైర‌స్ పై ప్ర‌పంచం మ‌రోసారి అప్ర‌మ‌త్తం అయింది. దీనిపై లోతైన ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. నియోకోవ్ వైర‌స్ అధిక ప్ర‌సార‌రేటు ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.

Read: శృతి హాసన్ కు “ఎన్బీకే 107” టీం విషెస్

Exit mobile version