Trump’s Assassination Attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియా ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత తాజా ఘటన జరిగింది. ఫ్లోరిడాలో ఆదివారం ట్రంప్ ఈ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సరిహద్దు దగ్గర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరపడంతో 58 ఏళ్ల అనుమానితుడు ర్యాన్ వెస్లీ రౌత్ పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఘటనా స్థలం నుంచి పవర్ ఫుల్ AK-47 తరహా రైఫిల్ మరియు గోప్రో కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపిన సమయంలో పొదల్లో దాక్కుని ఉన్న రౌత్ బయటకు వచ్చి నల్ల కారులో తప్పించుకున్నట్లు సమచారం. ప్రస్తుతం నిందితుడు తమ కస్టడీలో ఉన్నట్లు పామ్ బీచ్ కౌంటీ షరీప్ రిక్ బ్రాడ్ షా తెలిపారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు.. సేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు..?
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, రౌత్ నార్త్ కరోలినా గ్రీన్స్‌బోరోకు చెందిన మాజీ నిర్మాణ కార్మికుడు. రౌత్‌కి అధికారిక సైనిక నేపథ్యం లేనప్పటికీ, అతను గతంలో సాయుధ పోరాటంలో పాల్గొనాలనే కోరికని వ్యక్తం చేశాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 2022లో రైత్ ఉక్రెయిన్ తరుపున పోరాడాలనే ఆశని వ్యక్తం చేశాడు. ‘‘ఫైట్ అండ్ డై’’ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. తాను స్వచ్ఛందంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా అని కామెంట్స్ చేశాడు.
మెసేజింగ్ అప్లికేషన్ సిగ్నల్‌లో, రౌత్ తన ప్రొఫైల్ బయోలో భాగంగా “పౌరులు ఈ యుద్ధాన్ని మార్చాలి మరియు భవిష్యత్తులో జరిగే యుద్ధాలను నిరోధించాలి” అని రాశాడు. “మానవ హక్కులు, స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడంలో మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ మన వంతు కృషి చేయాలి; మనం ప్రతి ఒక్కరూ చైనీయులకు సహాయం చేయాలి” అని వాట్సాప్‌లో అతని బయోలో రాసుకున్నాడు. ఇదే కాకుండా ఉక్రెయిన్‌కి మద్దతు ఇవ్వడానికి ఆఫ్ఘన్ సైనికులను నియమించుకునేందుకు వెళ్లాలనని 2023లో ఓ ఇంటర్వ్యూలో అతను పేర్కొనడం గమనార్హం.