JD Vance: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వాన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Bigg Boss : ఛాన్స్‌ల కోసం పడుకుంటే తప్పేంటీ.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
ఇక, జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు.. ఆయనతో కలిసి పని చేసే వారిలో చాలా మంది ఆయన కంటే చిన్నవాళ్లే ఉన్నారు.. కానీ, వారందరి కంటే చివరిగా నిద్ర పోయేది, ఉదయాన్నే మొదట నిద్ర లేచేది అధ్యక్షుడేనని పేర్కొన్నాడు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయి.. వాటన్నింటినీ దాటుకొని.. ట్రంప్ మిగిలిన తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అమెరికన్లకు ట్రంప్ మంచి చేస్తారన్న నమ్మకం ఉంది.. ఒకవేళ ఏదైనా అనుకొని సంఘటన జరిగితే.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.
Read Also: RAGADA 4K : రగడ రీ రిలీజ్.. డిజాస్టర్ బుకింగ్స్.. ఆపండి ఇకనైన
కాగా, డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనకు దీర్ఘకాల సిరల వ్యాధి ఉందని తేలింది. అయితే, ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధి.. 70 ఏళ్లు దాటిన వారిలో కన్పిస్తుందని శ్వేతసౌధం వెల్లడించింది. ఈక్రమంలో దేశాన్ని గొప్పగా మార్చేందుకు తాను చేపట్టిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ ఉద్యమానికి జేడీ వాన్స్ వారసుడు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని ట్రంప్ తెలియజేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇందులో ఉండే అవకాశం ఉందన్నారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వాన్స్ నిలిచే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.
