Site icon NTV Telugu

Israel: అమెరికా రాయబారిగా మైక్ హకబీ నియామకం.. నెతన్యాహు అభినందనలు

Mikehuckabee

Mikehuckabee

ఇజ్రాయెల్ రాయబారిగా అర్కాన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ నియమితులయ్యారు. మైక్ హకబీ నియామకాన్ని అమెరికా సెనేట్ ధృవీకరించింది. మైక్ హకబీ నియామకంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్‌కు తదుపరి అమెరికా రాయబారిగా ప్రియమైన స్నేహితుడు మైక్ హకబీని నియమించినందుకు అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్-అమెరికన్ బంధానికి ఇది గొప్ప రోజు అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: DS 2 : శేఖర్ కమ్ములతో ధనుష్ మరో సినిమా

పశ్చిమాసియాలో శాంతి కోసం ప్రార్థిస్తున్నట్లు హకబీ తెలిపారు. ఒకరినొకరు పోట్లాడు కోవడం కంటే.. ఒకరినొకరు సహకరించుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకు ప్రజలు సహకరించాలని.. దేవుడు కూడా సహాయం చేస్తాడని భావిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ అజెండాను అమలు చేయడమే తన లక్ష్యమని హకబీ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్‌తో హకబీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అనేక మార్లు ఇజ్రాయెల్‌ను సందర్శించారు. హకబీ నియామకంతో ఇజ్రాయెల్-అమెరికా బంధం మరింత బలపడనుంది.

 

Exit mobile version